'గ్యాంగ్ వార్' ఆడియో
'కిక్' ఫేమ్ శ్యామ్ హీరోగా తమిళంలో రూపొందిన 'అంగపుర' చిత్రం తెలుగులో 'గ్యాంగ్ వార్' పేరుతో విడుదలకు సిద్ధమవుతోంది. టి.క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి తిరుమలై దర్శకుడు. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్స్ విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో శుక్రవారం జరిగింది. శ్యామ్, సుందర్ సి.బాబు, సముద్ర, తిరుమలై, దైవజ్ఞశర్మ తదితరులు పాల్గొన్నారు. ఆడియో సీడీని సముద్ర విడుదల చేసిన తొలి ప్రతిని శ్యామ్ కు అందించారు. మధుర ఆడియోస్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.
సముద్ర మాట్లాడుతూ, ఈ చిత్రంలోని పాటలు, ట్రైలర్లు మంచి కిక్ ఇచ్చేలా ఉన్నాయనీ, సినిమా సైతం ప్రేక్షకులకు డబుల్ కిక్ ఇస్తుందని ఆశిస్తున్నాననీ అన్నారు. శ్యామ్ మాట్లాడుతూ, ప్రతి మనిషి జీవితంలో వార్ అనేది ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటుందనీ, అలాంటి కథాంశంతో ఈ చిత్రం రూపొందిందనీ అన్నారు. 'కిక్' చేస్తున్న సమయంలోనే ఈ చిత్రం కూడా తయారైందనీ, తెలుగులో కూడా విడుదల చేయాలని దర్శకుడు సంకల్పించారనీ తెలిపారు. ఫిబ్రవరిలో సినిమా విడుదల ఉంటుందన్నారు. శ్యామ్ తమిళంలో నటించిన సినిమాల పాటలన్నీ హిట్టేననీ, ఈ చిత్రానికి తాను అందించిన సంగీతం కూడా మంచి సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాననీ సుందర్ సి.బాబు పేర్కొన్నారు.
Be first to comment on this News / Article!
|