'బెట్టింగ్ బంగార్రాజు' లోగో
ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ నుంచి ప్రొడక్షన్ నెంబర్ 84గా రూపొందుతున్న 'బెట్టింగ్ బంగార్రాజు' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. అల్లరి నరేష్ కథానాయకుడుగా నటిస్తున్నారు. ఆయనకు జోడిగా నిధి అనే కొత్తమ్మాయి పరిచయమవుతోంది. రామోజీరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇ.సత్తిబాబు దర్శకుడు. ఈ చిత్రం లోగోను తాజాగా విడుదల చేశారు.
ప్రచారార్భాటాలకు దూరంగా ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసుకోవడం విశేషం. కామెడీ చిత్రాల హీరోగా అల్లరి నరేష్ వరుస విజయాలు సొంతం చేసుకుంటుండగా, ఇ.సత్తిబాబు పలు కామెడీ చిత్రాలతో దర్శకుడుగా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న 'బెట్టింగ్ బంగార్రాజు' పూర్తి నవ్వుల వినోదాన్ని అందించనుంది. గోదావరి జిల్లాల్లో ఈ చిత్రానికి సంబంధించిన ఎక్కువ భాగం షూటింగ్ జరిపారు. పందేలంటే చెవికోసుకునే బెట్టింగ్ బంగార్రాజుగా అల్లరి నరేష్ కామెడీ సినిమాకి ప్రధాన హైలైట్ గా నిలువనుంది. చలపతిరావు, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి, గిరిబాబు, ఎల్బీ శరీరామ్, కృష్ణభగవాన్, రఘబాబు, దువ్వాసి, మేల్కొటి, ప్రగతి, కల్పన, పూర్ణిమ, సన, సురేఖా వాణి, హేమ తదితరులు ఈ చిత్రంలో నటించారు. నాగరాజు గంధం ('గమ్యం' ఫేమ్) మాటలు, అనంత్ శ్రీరామ్, రామజోగయ్య శాస్త్రి పాటలు, కరుణమూర్తి ఛాయాగ్రహణం, విజయ్ ఫైట్స్, గౌతంరాజు ఎడిటింగ్, శేఖర్ చంద్ర ('నచ్చావులే' ఫేమ్) సంగీతం అందించారు. త్వరలోనే ఆడియో, సినిమా రిలీజ్ కు ప్లానింగ్ జరుగుతోంది.
Be first to comment on this News / Article!
|