'వీర'గా రవితేజ
రవితేజ ఇవాల్టి బిజీ హీరో. గత ఏడాది 'కిక్' వంటి సెన్సేషన్ హిట్ ను ఇచ్చిన రవితేజ ఈ ఏడాది సంక్రాంతికి 'శంభో శివ శంభో' చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. తాజాగా 'టాలీ 2 హాలీ' సంస్థ రవితేజ కథానాయకుడుగా 'వీర' అనే చిత్రాన్ని ప్రకటించింది. ఇటీవలే ఈ సంస్థ నిర్మించిన 'ప్రవరాఖ్యుడు' ప్రేక్షకాదరణ చూరగొంది. తదుపరి చిత్రంగా రవితేజతో 'వీర' చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మాత గణేష్ ఇందుకూరి నిర్మించనున్నారు. దీనికి రమేష్ వర్మ ('రైడ్' ఫేమ్) దర్శకత్వం వహించనున్నారు. సోమవారం రవితేజ పుట్టినరోజును పురస్కరించుకుని 'వీర్' ఫస్ట్ లుక్ ను మీడియాకు రిలీజ్ చేశారు.
సమ్మర్ లో ప్రారంభం కానున్న ఈ చిత్రానికి పరుచూరి సోదరులు సంభాషణలు, శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ, దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నారు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.
Be first to comment on this News / Article!
|