హరీష్ డైరెక్షన్ లో రవితేజ
రవితేజ కథానాయకుడుగా హరీష్ శంకర్ ('షాక్' ఫేమ్) డైరెక్షన్ లో ఓ కొత్త చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిని ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై రమేష్ పుప్పాల నిర్మించనున్నారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ అధినేత వెంకట్ సమర్పకుడుగా వ్యవహరించనున్నారు.
రమేష్ పుప్పాల ఈ విషయాన్ని తెలియజేస్తూ, రవితేజ హీరోగా రూపొందనున్న ఈ చిత్రం కోసం హరీష్ శంకర్ అద్భుతమైన కథ సిద్ధం చేశారనీ, అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించనున్నామనీ తెలిపారు. మేలో షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పారు. ఈ చిత్రానికి ఆర్.డి.రాజశేఖర్ ఫోటోగ్రఫీ, రామ్-లక్ష్మణ్ ఫైట్స్, గౌతంరాజు ఎటింగ్, థమన్ ఎస్. సంగీతం అందించనున్నారు. ఇతర నటీనటులు, టెక్నీషియన్ల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.
Be first to comment on this News / Article!
|