రవితేజ 'డాన్ శీను' షురూ
రవితేజ కథానాయకుడుగా గత ఏడాది 'కిక్' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సంస్థ తాజాగా మళ్లీ రవితేజతోనే కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఈ చిత్రానికి 'డాన్ శీను' అనే టైటిల్ నిశ్చయించారు. కె.అచ్చిరెడ్డి సమర్పణలో వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా గోపీచంద్ మలినేని దర్శకుడుగా పరిచయమవుతున్నారు. హైద్రాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో పరిశ్రమ ప్రముఖుల మధ్య అట్టహాసంగా సోమవారంనాడు ఈ చిత్రం ప్రారంభమైంది. రవితేజ, శ్రీహరిపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి ఎన్టీఆర్ క్లాప్ ఇవ్వగా, డాక్టర్ డి.రామానాయుడు కెమెరా స్విచ్చాన్ చేశారు.
ఈ చిత్రంలో రవితేజకు జోడిగా త్రిష నటించనుంది. కోన వెంకట్ మాటలు, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణిశర్మ సంగీతం అందించనున్నారు.ఈ చిత్ర ప్రారంభోత్సవంలో జగపతిబాబు, ఇవివి సత్యనారాయణ, వి.వి.వినాయక్, సుమంత్, శ్యాంప్రసాద్ రెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ, అచ్చిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|