'కామ్రేడ్'గా రాజశేఖర్
'నా స్టైల్ వేరు' చిత్రం తర్వాత డాక్టర్ రాజశేఖర్ కథానాయకుడుగా మరో కొత్త చిత్రం సెట్స్ పైకి రాబోతోంది. శ్రీ ధనలక్ష్మీ ప్రొడక్షన్స్ సమర్పణలో శ్రీ సాయికృష్ణా ప్రొడక్షన్స్ సంస్థ 'కామ్రేడ్' అనే పేరుతో ఓ భారీ చిత్రాన్ని నిర్మించనుంది. దీనికి కన్నెగంటి కృష్ణ దర్శకుడు. ఫిబ్రవరి 4న రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం షూటింగ్ ప్రారంభిస్తున్నట్టు నిర్మాత డి.ఎస్.రావు తెలిపారు.
ఈ చిత్రంలో రాజశేఖర్ ఒక పవర్ ఫుల్ పాత్రలో నటించనున్నారనీ, పరుచూరి బ్రదర్స్ అద్భుతమైన కథతో పాటు సంభాషణలు కూడా అందిస్తున్నారనీ ఆయన చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని అన్నారు. కాగా, రాజశేఖర్ కథానాయకుడు నటి-నిర్మాత కల్యాణి తన భర్త సూర్యకిరణ్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని ఇప్పటికే ప్లాన్ చేశారు. సోసియో ఫాంటసీగా రూపొందనున్న ఈ చిత్రం కూడా అతి త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది. రాజశేఖర్ కథానాయకుడుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందనున్న 'రాజశేఖర రెడ్డి' సైతం ఈ ఏడాది ప్రారంభం కావలసి ఉంది.
Be first to comment on this News / Article!
|