సిటీలో ఎన్టీఆర్ ఛేజింగ్
సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో 'అదుర్స్' ప్రేక్షకాదరణలో ముందండటం, పలు రికార్డులు కైవసం చేసుకుంటుందన్న అంచనాల మధ్య ఎన్టీఆర్ రెట్టించిన ఉత్సాహంతో తన తదుపరి చిత్రమైన 'బృందావనం' (గోవిందుడు అందరి వాడేలే) షూటింగ్ లో పాల్గొంటున్నారు. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి ('మున్నా' ఫేమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ కు హైదారాబాద్ లో అవాంతరాలు ఎదురుకావడంతో కొంత షూటింగ్ ను పొల్లాచ్చిలో చిత్రీకరించి, మళ్లీ ఇప్పుడు హైద్రాబాద్ లో చిత్రీకరణ జరుగుతోంది. తాజాగా బంజారాహిల్స్ లోని శబ్దాలయ సమీపంలో ఒక ఛేజ్ సన్నివేశాన్ని ఎన్టీఆర్ పై చిత్రీకరిస్తున్నారు. దీనిని పీటర్ హెయిన్స్ కంపోజ్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ ఎంపిక జరగాల్సి ఉంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ, ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు.
Be first to comment on this News / Article!
|