రామ్ చరణ్ పెప్సీకి త్రివిక్రమ్
సంచలన కథానాయకుడు రామ్ చరణ్ తేజ, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలిసారి కలిసి పనిచేయబోతున్నారు. ఇది కూడా కమర్షియల్ యాడ్ కోసం కావడం విశేషం. త్రివిక్రమ్ కు కూడా ఇది తొలి కమర్షియల్ యాడ్ కానుంది. రామ్ చరణ్ ఇప్పటికీ పెప్సీ సాఫ్ట్ డ్రింక్ కు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఇందులో చరణ్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే కలిసి నటించారు. 'మగధీర' అద్భుత విజయం తర్వాత రామ్ చరణ్ కు పెరిగిన పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని అడ్వర్ టైజింగ్ ఏజెన్సీ వారు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ యాడ్ ను ప్లాన్ చేశారు. ఈ యాడ్ కు కాన్సెప్ట్ ను కూడా త్రివిక్రమ్ అందిస్తున్నారు. ఇందుకోసం ఆయనకు భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్టు తెలిసింది.
పెప్సీ తాజా కమర్షియల్ ను వచ్చేవారం ముంబైలో చిత్రీకరించనున్నారు. ఫిబ్రవరి నుంచి ఈ టెలివిజన్ కమర్షియల్ ప్రసారమవుతుంది.
Be first to comment on this News / Article!
|