నాగచైతన్యతో కామాక్షి చిత్రం
'జోష్' చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటిస్తున్న నాగచైతన్య తదుపరి చిత్రం కూడా ఖరారైంది. ఈ చిత్రాన్ని కామాక్షి కళా మూవీస్ బ్యానర్ పై డి.శివప్రసాద్ రెడ్డి నిర్మించబోతున్నారు. మార్చిలో ఈ భారీ చిత్రం షూటింగ్ ప్రారంభించనున్నట్టు శివప్రసాద్ రెడ్డి తెలిపారు.
కామాక్షి మూవీస్ సిల్వర్ జూబ్లీ ఇయర్ లో నాగచైతన్య హీరోగా చిత్రాన్ని నిర్మించనుండటం చాలా హ్యాపీగా ఉందనీ, ఇందులో నాగచైతన్యకు జోడిగా కాజల్ నటిస్తుందనీ తెలిపారు. అజయ్ భూయాన్ ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ చిత్రానికి అద్భుతమైన సబ్జెక్ట్ రెడీ అయిందనీ, భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తామనీ ఆయన చెప్పారు. దీనికి వి.ఎస్.జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. కాగా, నాగార్జున కథానాయకుడుగా శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న 'కేడి' చిత్రం ఫిబ్రవరి 12న విడుదలవుతోంది.
Be first to comment on this News / Article!
|