ఫిబ్రవరిలో 'ధూందాం'
డైలీ 4 షోస్ పతాకంపై ప్రజాకవి గోరటి వెంకట్న ప్రత్యేక పాత్రలో రూపొందిన సందేశాత్మక చిత్రం 'ధూందాం'. శివానంద్ యాలాల దర్శకత్వంలో వై.వైవస్వత మను ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటూ ఫిబ్రవరి రెండో వారంలో విడుదలకు సిద్ధమవుతోంది.
నిర్మాత వైవస్వత మను ఆ విశేషాలను తెలియజేస్తూ, తెలంగాణ ప్రజల జీవన స్థితిగతులు, వారి సమస్యలను ఈ చిత్రంలో తెరకెక్కించినట్టు చెప్పారు. ఇందులో తానొక జర్నలిస్టు పాత్రను కూడా పాషించానని తెలిపారు. ప్రజాకవి గోరటి వెంకన్న పాడిన పాటలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయనీ, అలాగే తెలంగాణ జిల్లాల్లో ఎన్నో స్టేజ్ షోల ద్వారా గీతాలను ఆలపించిన బేబి మధుప్రియ ఇందులో నటించిందనీ చెప్పారు. ఇతర ప్రాధాన్యమైన పాత్రల్లో బ్రహ్మాజీ, రఘునాధరెడ్డి, పద్మా జయంత, రాంబాబు, వైజాగ్ లక్ష్మి తదితరులు నటించినట్టు తెలిపారు. ఫిబ్రవరి రెండో వారంలో వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ చిత్రానికి శివానంద్ యాలాల సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|