'వేదం'లో దీక్షా సేథ్
ఈ ఏడాదిలో విడుదల కానున్న చిత్రాల్లో ఇప్పటికే స్టార్ కాస్ట్ పరంగా అంచనాలను పెంచుతున్న 'వేదం'లో మరో యంగ్ బ్యూటీ వచ్చిచేరింది. ఆమె మరెవరో కాదు. మిస్ ఇండియా-2009 దీక్షా సేథ్. ఈమధ్యనే పాంటలూన్ ఫెమినా కాంటెస్ట్ 'ఫ్రెష్ ఫేస్'గా కూడా సేథ్ ఎంపికైంది. ఇటీవలే విడుదలైన న్యూఇయర్ కేలండర్ లో ఆమెను చూసిన 'వేదం' దర్శకనిర్మాతలు ఆమెకు తమ చిత్రంలో అవకాశం ఇచ్చినట్టు సమాచారం.
'గమ్యం' చిత్రంతో తెలుగు సినిమా దిశను మార్చిన దర్శకుడు క్రిష్ ద్వితీయ ప్రయత్నంగా మల్టీస్టారర్ 'వేదం' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తొలుత దీనిని చిన్నచిత్రంగా అంతా కొత్తతారలతో తీయాలని క్రిష్ అనుకున్నప్పటికీ కథ నచ్చి అల్లు అర్జున్ నటించేందుకు ఒప్పుకోవడం, మరో పాత్రకు మంచు మనోజ్ ను ఆయన సిఫారసు చేయడం, అల్లు అర్జున్ ఉన్నట్టు తెలుసుకున్న అనుష్క మరో కీలక పాత్రకు అంగీకరించడంతో ఒక్కసారిగా 'వేదం' బిగ్ బడ్జెట్ ఫిల్మ్ గా మారింది. వీరితో పాటు మరో కీలక పాత్రను మనోజ్ బాజ్ పేయి పోషిస్తున్నారు. ఇందులో ఉత్తరాదికి చెందిన ఒక కొత్తమ్మాయిని ఎంపిక చేయాలని దర్శకనిర్మాతలు అన్వేషిస్తున్న తరుణంలో దీక్ష సేథ్ కు ఆ అవకాశం దక్కంది. ఇప్పడిప్పుడే మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ ఉత్తరాది సుందరి ఇంత మంచి అవకాశం తెలుగులో రావడంతో
సంబరంలో మునిగితేలుతోందట. శోభ యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సమ్మర్ సెలవుల్లో 'వేదం' ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
Be first to comment on this News / Article!
|