'ఆర్య-2' కేరళ రికార్డ్
అల్లు అర్జున్ కు కేరళలో మంచి క్రేజ్ ఉంది. ఆయన గతంలో నటించిన 'ఆర్య', 'దేశముదురు' వంటి చిత్రాలు అక్కడి స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా వసూళ్లు చేసి మంచి సక్సెస్ చవిచూశాయి. ఏ తెలుగు హీరోకూ లేనంత మంచి మార్కెట్ అక్కడ అల్లు అర్జున్ కు ఉండటంతో ఆయన తాజా చిత్రం 'ఆర్య-2' సైతం మలయాళంలో విడుదలకు సిద్ధమైంది. గట్టి పోటీ మధ్య ఈ చిత్రం మలయాళం రైట్స్ ను దివ్య పిక్చర్స్ కొనుగోలు చేసింది. ఇందుకోసం భారీ మొత్తాన్ని చెల్లించింది. ఆసక్తికరంగా సినిమా రిలీజ్ కు ముందే దివ్య పిక్చర్స్ కు 2 కోట్ల రూపాయల టేబుల్ ప్రాఫిట్ లభించిందనీ, ఇది అల్లు అర్జున్ చిత్రాల్లోనే సరికొత్త రికార్డనీ తెలుస్తోంది.
అల్లు అర్జున్, నవదీప్, కాజల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. సహజంగానే మలయాళంలో అల్లు అర్జున్ 'ఆర్య' హిట్ కావడంతో 'ఆర్య-2' పై అక్కడ మంచి అంచనాలున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకునే కేరళలో 100కు పైగా థియేటర్లలో ఈనెల 5న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.
Be first to comment on this News / Article!
|