'కేడి' ట్రిపుల్ ప్లాటినం 6న
నాగార్జున కథానాయకుడుగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో కామాక్షి కళా మూవీస్ పతాకంపై డి.శివప్రసాద్ రెడ్డి నిర్మించిన 'కేడి' చిత్రం భారీ అంచనాల మధ్య ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ద్వారా కిరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సందీప్ చౌతా సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఇటీవలే విడుదలై చక్కటి ఆదరణ చూరగొంటోంది. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ప్లాటినం డిస్క్ వేడుకను ఈనెల 6న హైద్రాబాద్ లో ఘనంగా నిర్వహించనున్నారు.
'కింగ్' వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత నాగార్జునతో తమ బ్యానర్ లో రూపొందిస్తున్న స్టైలిష్ కమర్షియల్ చిత్రమిదనీ, ఇంతవరకూ నాగార్జునను చూపించిన వైవిధ్యమైన కోణంలో దర్శకుడు ఆయనను ప్రెజెంట్ చేశారనీ శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఇది తమ సంస్థకు మరో సూపర్ హిట్ చిత్రమవుతుందని అన్నారు. గాంబ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నాగార్జునకు జోడిగా మమతా మోహన్ దాస్ నటించింది. అమెరికా అమ్మాయి లిండా మరో కీలక పాత్రను పోషించింది. 'స్లమ్ డాగ్ మిలయనీర్' ఫేమ్ అంకుర్, 'బండిట్ క్వీన్' ఫేమ్ నిర్మల్ పాండే, 'లగాన్' ఫేమ్ అఖిలేంద్ర మిశ్రా, 'డాన్' విలన్ కెల్లీ డార్జ్, సాయాజీ షిండే, బ్రహ్మానందం, హర్షవర్ధన్, తనికెళ్ల భరణి ఇతర కీలక పాత్రలు పోషించారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం కిరణ్ అందించిన ఈ చిత్రానికి సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ, చిన్నచరణ్-కృష్ణ చైతన్య పాటలు, సెల్వ ఫైట్స్, శ్రవణ్ ఎడిటింగ్ అందించారు.
Be first to comment on this News / Article!
|