'మర్యాదరామన్న'పై దాడి
'గోలీమార్' చిత్రాన్ని తెలంగాణ ఉద్యమకారులు అడ్డుకున్న 24 గంటలు తిరక్కుండానే మరో చిత్రం షూటింగ్ పై కూడా మంగళవారం దాడి జరిగింది. కమెడియన్ సునీల్ హీరోగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'మర్యాదరామన్న' చిత్రం షూటింగ్
రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సమీపంలో జరుగుతుండగా తెలంగాణ ఉద్యమకారులు షూటింగ్ ను అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. యూనిట్ పై దాడి జరిగిన సమయంలో రాజమౌళి, సునీల్ షూటింగ్ స్పాట్ లో ఉన్నారు. పరిస్థితిని గమనించిన చిత్ర యూనిట్ వెంటనే షూటింగ్ నిలిపివేసి హైదరాబాద్ కు తిరిగి వచ్చింది. వికారాబాద్ సమీపంలో షూటింగ్ ను అడ్డుకోవడం ఇది రెండోసారి. ఇటీవల మహేష్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రానికి సంబంధించిన కోటి రూపాలయ సెట్ ను ఆందోళనకారులు నిప్పుపెట్టారు.
రాయలసీమను ఇంతవరకూ ఫ్యాక్షన్ గ్రౌండ్ గానే ఎన్నో సినిమాల్లో చూపించగా...సీమలోని మానవతావాదాన్ని చాటిచెప్పే కథాంశంతో 'మర్యాద రామన్న' చిత్రాన్ని ఎంటర్ టైన్ మెంట్ ప్రధానంగా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఆర్క మీడియా వర్క్స్ బ్యానర్ పై శోభ యార్గగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|