ఎన్టీఆర్ కారుకు ఫ్యాన్సీ నెంబర్
ఎన్టీఆర్ తన సరికొత్త బిఎండబ్ల్యు కారుకు 9999 అనే ఫ్యాన్సీ నెంబర్ ను వేలంలో సొంతం చేసుకున్నారు. రవాణా శాఖ తాజాగా నిర్వహించిన వేలంలో ఎన్టీఆర్ అక్షరాలా 5 లక్షల రూపాయలు చెల్లించి ఆ నెంబర్ ను దక్కించుకున్నారు. ఆర్థిక మాంధ్య కారణంగా ఫ్యాన్సీ నెంబర్లపై జనాలకు ఆసక్తి సన్నగల్లిగిన తరుణంలో ఎన్టీఆర్ ఇంత పెద్ద మొత్తం చెల్లించి ఫ్యాన్సీ నెంబర్ ను సొంతం చేసుకోవడం రవాణా శాఖ అధికారులను సైతం ఆనందంలో ముంచెత్తుతోంది.
ఎన్టీఆర్ 9999 కోసం ఇంత మోజు పడటం వెనుక అసలు సిసలైన కారణం ఒకటుంది. పెద్ద ఎన్టీఆర్ కు ఇష్టమైన సంఖ్య నెంబర్ 9. తాత పోలికలతో ఉన్న ఎన్టీఆర్ సైతం నందమూరి అభిమానుల ఆదరం చూరగొంటూ ముందుకు దూసుకువెళ్తున్నారు. గత ఏడాది ఏప్రిల్ లో జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న ఎన్టీఆర్ ఇటీవల ఒకటి రెండు సందర్భాల్లో తనకు దేవుడు కొత్తజీవితం ప్రసాదించారనీ, అభిమానులు 'అదుర్స్' చిత్రానికి ఘనవిజయం అందించి ఆదరించారనీ తన కృతజ్ఞతలు చెప్పుకొన్నారు. కొత్తజీవితంలో కొంగ్రొత్త ఆశలు నింపుకొంటున్న ఎన్టీఆర్ అందులో భాగంగానే ఇటీవల తనకు కాబోయే జీవిత భాగస్వామిని ఎంచుకుని మేలో పెళ్లి పీటల మీదకు రాబోతున్నారు. కెరీర్ పరంగా 'బృందావనం', 'శక్తి' చిత్రాల్లో ఏకకాలంలో నటిస్తూ తన స్పీడ్ ను చాటుకుంటున్నారు. పనిలో పనిగా ఫ్యాన్సీ కార్ నెంబర్ ను కూడా సొంతం చేసుకున్నారు. గ్రేట్ గోయింగ్ కదూ...
Read 3 Comment(s) posted so far on this News / Article!
|