బాలయ్య 'సింహా' ఏప్రిల్ 9న
నందమూరి బాలకృష్ణ కథానాయకుడుగా పవర్ ఫుల్ కథాంశంతో రూపొందుతున్న తాజా చిత్రం 'సింహా'. రవితేజతో 'భద్ర', వెంకటేష్ తో 'తులసి' వంటి హిట్ చిత్రాల తర్వాత హ్యాట్రిక్ ఫిల్మ్ గా దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరిటీ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం నుంచి హైద్రాబాద్ లో చిత్ర పతాక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. బాలకృష్ణ, స్నేహ ఉల్లాల్, కె.ఆర్.విజయ, మలయాళ నటుడు సాయికుమార్, పలువురు ఫైటర్లపై ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో ఈ క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నారు.
నిర్మాత పరుచూరి కిరీటి మాట్లాడుతూ, బాలయ్యను కొత్త కోణంలో చూపించే చిత్రమిదనీ, శరవేగంగా షూటింగ్ పూర్తవుతోందనీ చెప్పారు. ఈనెల 20 నుంచి విదేశాల్లో మూడు పాటలు చిత్రీకరించనున్నామని చెప్పారు. తమ బ్యానర్ నుంచి వస్తున్న చిత్రాల్లోనే ఇది ఖరీదైన చిత్రమని చెప్పారు. ఏప్రిల్ 9న వేసవి కానుకగా సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. దర్శకుడు బోయపాటి మాట్లాడుతూ, ఇందులో బాలయ్య క్యారెక్టర్ హైలైట్ అనీ, ఆయన పాత్ర చిత్రణ, శారీరక భాష, అభినయం అన్నీ కొత్తగా ఉంటాయనీ చెప్పారు. చక్రి ఆరు అద్భుతమైన పాటలు అందించారనీ, మంచి టెక్నీషియన్లతో చిత్రం తెరకెక్కుతోందనీ అన్నారు. బాలకృష్ణ సరసన నయనతార తొలిసారి నటిస్తోందన్నారు. ఆమె మినహా ఆ పాత్రకు మరెవరూ సరిపోరనీ, అలాగే స్నేహ ఉల్లాల్, నమిత కథానాయికలుగా నటిస్తున్నారనీ చెప్పారు. ఈ చిత్రానికి ఆర్దర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ, స్టన్ శివ-రామ్ లక్ష్మణ్ ఫైట్స్, ఎ.ఎస్.ప్రకాష్ ఆర్ట్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|