'బావ'లో రాజేంద్రప్రసాద్
సిద్దార్ధ కథానాయకుడుగా శ్రీ కీర్తి క్రియేషన్స్ బ్యానర్ పై ఎం.ఎల్.కుమార్ చౌదరి నిర్మిస్తున్న 'బావ' చిత్రంలో ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఓ కీలక పాత్రకు ఎంపికయ్యారు. సిద్దార్ధ తండ్రి పాత్రను ఇందులో ఆయన పోషించనున్నట్టు తెలుస్తోంది. రాజేంద్రప్రసాద్ నటించిన ఓ చిత్రంలో బాలనటుడుగా నటించిన రాంబాబు ఆ తర్వాత దర్శకత్వ శాఖలో అనుభవం గడించి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
బావామరదళ్ల మధ్య జరిగే ప్రేమకథా ఇతివృత్తంగా 'బావ' చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించబోతున్నారు. రెండేళ్ల గ్యాప్ తర్వాత ఎం.ఎల్.కుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రం ద్వారా ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయనున్నారు. ఈనెల 15 నుంచి రాజమండ్రిలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇందులోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, ఆలీ, ఆహుతి ప్రసాద్, రఘబాబు, నాజర్, రజిత, సురేఖా వాణి, మాస్టర్ భరత్ తదితరులు నటించనున్నారు. చింతపల్లి రమణ మాటలు, అరవింద్ ఫోటోగ్రఫీ, విజయ్ ఫైట్స్, గౌతంరాజు ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|