నిర్మాత కిషోర్ బాబు మృతి
తెలుగులో పలు చిత్రాలకు నిర్మాణ భాగస్వామ్యం వహించిన పి.కిషోర్ బాబు హైదరాబాద్ లో కన్నుమూశారు. మెదడులో నరాలు చిట్లడంతో రెండ్రోజుల క్రితం కుప్పకూలిన కిషోర్ బాబు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన వయసు 42 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
కిషోర్ బాబు తెలుగులో 'థమ్', 'నగరం', అనువాద 'గాయం' చిత్రాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. ప్రముఖ నిర్మాత డాక్టర్ డి.రామానాయుడుకు ఆయన స్వయానా మేనల్లుడు. బుధవారంనాడు ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్ లోని నివాసంలో కొద్దిసేపు ఉంచారు. డాక్టర్ డి.రామనాయుడు, డి.సురేష్ బాబు, వెంకటేష్, కె.ఎల్.నారాయణ తదితరులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. అనంతరం హైదరాబాద్ లోనే కిషోర్ బాబు అంత్యక్రియలు జరిగాయి.
Be first to comment on this News / Article!
|