'భీమిలి కబడ్డీ జట్టు' సిద్ధం
నాని, శరణామోహన్ జంటగా మెగా సూపర్ గుడ్ బ్యానర్ పై ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'భీమిలి కబడ్డీ జట్టు'. తాతినేని సత్య దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
చిత్ర విశేషాలను ఆర్.బి.చౌదరి తెలియజేస్తూ, మంచి స్టోరైలైన్ తో ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారనీ, భీమిలి, హైదరాబాద్, రాజమండ్రి, పోలవరం ప్రాంతాల్లో షూటింగ్ జరిపామనీ చెప్పారు. అంతర్వేదిలో ప్రత్యేకంగా వేసిన జాతర సెట్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించామని తెలిపారు. మార్చి మొదటి వారంలో ఆడియో, అదే నెలలో సినిమా విడుదల చేస్తామని అన్నారు. చక్కటి కథ-కథనాలతో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని దర్శకుడు సత్య వ్యక్తం చేశారు. సారధి స్టూడియోస్ లో 35 లక్షల రూపాలతో కబడ్డీ సెట్ వేసి తీసిన సన్నివేశాలు హైలైట్ గా ఉంటాయన్నారు. ఈ చిత్రంతో దర్శకుడుగా సత్య, సంగీత దర్శకుడుగా సెల్వ గణేషన్, ఛాయాగ్రాహకుడుగా చిట్టిబాబును పరిచయం చేసినట్టు నిర్మాతలు తెలిపారు. పాటలు వైజాగ్, కేరళలో చిత్రీకరించామనీ, నిర్మాణపరంగా ఎక్కడా రాజీపడలేదనీ అన్నారు. ఎన్నో హిట్లు అందించిన సూపర్ గుడ్ సంస్థకు ఇది మరో హిట్ చిత్రమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కిషోర్, కీర్తన తదితరులు నటించిన ఈ చిత్రానికి సురేంద్రన్ కథ, నందమూరి హరి ఎడిటింగ్, కుమార్ కళాదరర్శకత్వం వహించారు.
Be first to comment on this News / Article!
|