'నిన్ను చూసిన క్షణాన'
హనీష్ రాజేశ్వర్ ను హీరోగా పరిచయం చేస్తూ అనుష్క ప్రొడక్షన్స్ పతాకంపై కె.వి.రవికుమార్ నిర్మిస్తున్న ప్రేమకథా చిత్రం 'నిన్ను చూసిన క్షణాన'. నగేష్ నాగరాశి దర్శకుడు. హనీష్ సరసన బార్బి హండా కథానాయికగా నటించింది. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. లహరి ఆడియో ద్వారా ఈనెల 25న ఆడియో విడుదల చేస్తున్నట్టు దర్శకనిర్మాతలు తెలిపారు.
తెలుగు తెరపై సరికొత్త కథాంశంతో వస్తున్న చిత్రమిదని రవికుమార్ తెలిపారు. హైద్రాబాద్, గోవా, బెంగుళూరు తదితర అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపామనీ, ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయనీ చెప్పారు. నగేష్ నారదాశి మాట్లాడుతూ, చిన్నతనంలో స్నేహితులుగా విడిపోయిన ఓ అమ్మాయి, ఓ అబ్బాయి పెద్దయ్యాక ఎటువంటి పరిస్థితుల్లో కలిశారు? వారి మధ్య ప్రేమ ఎలా చిగురించి ఒక్కటి కాగలిగారనేది ఈ చిత్ర కథాంశం మని అన్నారు. పాటలతో పాటు సినిమా కూడా ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంటుందన్నారు. హీరోగా తనకు ఈ చిత్రం మంచి గుర్తింపు తెస్తుందని ఆశిస్తున్నట్టు హనీష్ రాజేశ్వర్ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, ఏవియస్, ఉత్తేజ, గుండు, కొండవలస, చలపతిరావు, చిత్రం శ్రీను, విజయ్, సైరాభాను తదితరులు నటించారు. మధు ఎ నాయుడు సినిమాటోగ్రఫీ, నందమూరి హరి ఎడిటింగ్, సాయి కార్తీక్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|