1200 ప్రింట్లతో 'ఆవహం'
రాత్రి...దెయ్యం...వంటి పలు హారర్ చిత్రాలను అందించిన రామ్ గోపాల్ వర్మ మరోసారి ప్రేక్షకులను 'ఆవహం' చిత్రంతో భయపెట్ట బోతున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఆమధ్య వర్మ తీసిన 'రక్ష' (హిందీ 'ఫూంక్ ') చిత్రానికి ఇది సీక్వెల్. హిందీలో 'ఫూంక్-2'గా విడుదలవుతుంది. రామ్ గోపాల్ వర్మ సమర్పణలో సార్ధక్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, జడ్ త్రీ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వర్మ శిష్యుడు మిలింద్ గడార్కర్ దర్శకుడు. ఏప్రిల్ 9న ఈ చిత్రం విడుదలకు ప్లానింగ్ జరుగుతోంది.
వర్మ మాట్లాడుతూ, ఆమధ్య తాను తీసిన 'రక్ష' చిత్రం అనుకున్నంత భయపెట్టలేదన్న ఓ వాదన ఉందనీ, ఆ లోటును పూడ్చేందుకే 'ఆవహం' తీస్తున్నామనీ వర్మ చెప్పారు. రచయిత మిలంద్ ఈ సినిమా ఓపినింగ్ సీక్వెన్స్ చెప్పినప్పుడు చాలా ఎగ్జయిట్ అయ్యాననీ, ప్రేక్షకులు కూడా ఇలాంటి అనుభూతినే పొందుతారని ఆయన అన్నారు. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం రూపొందుతోందనీ, ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని డిజిటల్ ఇంటర్మీడియట్ వర్క్ జరుగుతోందనీ నిర్మాత ప్రశాంత్ బుర్రా తెలిపారు. ఈ సినిమా చూసి భయపడని వారెవరూ ఉండరనీ, దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక స్పెషల్ సౌండ్ ఎఫెక్ట్స్ ను ఈ చిత్రానికి వినియోగిస్తున్నామనీ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 3 భాషల్లో 1200 ప్రింట్లతో సినిమా విడుదల చేస్తామని చెప్పారు. సుదీప్, అమృత కన్విల్కర్, ఎహసాన్ చన్నా, రిషబ్ జైన్, అను అన్సారి, గణేష్ యాదవ్, మనీష్ ఖన్నా తదితరులు నటించిన ఈ చిత్రానికి చంద్రకాంత్ వసంత్ మెహర్ సినిమాటోగ్రఫీ అందించారు.
Be first to comment on this News / Article!
|