'బిందాస్' విజయయాత్ర
మంచు మనోజ్, షీనా జంటగా వీరుపోట్లను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎ.కె.ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మించిన 'బిందాస్' చిత్రం ప్రేక్షకాదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులను నేరుగా థియేటర్ల వద్ద కలుసుకుని కృతజ్ఞతలు చెప్పేందుకు చిత్రయూనిట్ 'బిందాస్' విజయయాత్రను చేపట్టనుంది. ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు చోట్ల ఈ విజయయాత్ర నిర్వహించనున్నారు.
ఈనెల 28న విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రిలో థియేటర్ల వద్ద ప్రేక్షకులను చిత్రయూనిట్ కలుసుకుంటుంది. మార్చి 1న ఏలూరు, విజయవాడ, గుంటూరు, చిలకలూరిపేటలో పర్యటిస్తారు. మార్చి 2న ఒంగోలు, నెల్లూరులో ప్రేక్షకులతో చిత్ర విజయానందాన్ని పంచుకుంటారు. ఈ సక్సెస్ టూర్ లో చిత్ర మంచు మనోజ్, వీరుపోట్ల, సుంకర రామబ్రహ్మంతో పాటు నటీనటులు కాశీ విశ్వనాథ్, శ్రవణ్, పృధ్వి, మాధవి, జయలక్ష్మి, పలువురు సాంకేతిక నిపుణులు పాల్గొంటారు.
Be first to comment on this News / Article!
|