క్షమాపణ కోరుతున్న ఛార్మి?
అందాల నటి ఛార్మి, నిర్మాత రవిచంద్ మధ్య తలెత్తిన వివాదం ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రధాన చర్చనీయాంశమవుతోంది. 'మాయగాడు' చిత్రం రిలీజ్ కు నోచుకోకుండా పోవడంతో ఆ చిత్రం ప్రమోషన్ వర్క్ కు ఛార్మిని రప్పించాలనే నిర్మాత ప్రయత్నం ఈ ఇద్దరి మధ్యా చిలికి చిలికి గాలివానగా మారింది. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి నిర్మాత సినిమా తీసి రిలీజ్ చేసుకోలేని పరిస్థితులో ఇవాల్టి నిర్మాత ఉన్నాడనీ, నిర్మాతల దగ్గర లక్షల్లో పారితోషికం తీసుకునే ఛార్మి వంటి హీరోయిన్లు నిర్మాతల కష్టాలు పట్టించుకోకపోవడం ఏమిటని రవిచంద్ నిలదీస్తున్నారు. అయితే రవిచంద్ చిత్ర నిర్మాణ సమయంలో అనుచితంగా ప్రవర్తించారనీ, తనను బాగా ఎక్స్ పోజింగ్ కు వాడుకున్నారనీ, చివరకు కాలు బెణికి పడిపోతే దానిని కూడా సినిమాలో ఎక్స్ పోజింగ్ పరంగా వాడుకోవాలని చూస్తున్నారనీ ఛార్మి అంటోంది. తన భద్రత విషయంలో కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారంటూ ఆమె వాపోతుంది. నిర్మాతల ఏదైనా చెప్పాల్సి వస్తే నిర్మాతల మండలికో, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) దృష్టికో తీసుకుని వెళ్లాల్సిందనీ, అలా కాకుండా పత్రికలకు ఎక్కి తనకున్న పేరును చెడగొట్టే ప్రయత్నం సహించేది లేదనీ ఆమె 'మా'కు ఇచ్చిన ఫిర్యాదులో స్పష్టం చేసినట్టు సమాచారం. రవిచంద్ చేత క్షమాపణ చెప్పించాలని ఆమె పట్టుబట్టినట్టు కూడా చెబుతున్నారు.
ఛార్మికి రవిచంద్ క్షమాపణ చెప్పడం విడ్డూరమే అవుతుందని ఇండస్ట్రీకి చెందిన పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నిర్మాత సినిమా తీసి రెండేళ్లుగా విడుదల చేసుకోలేని విధంగా ఇబ్బందులు పడుతుంటే అగ్రిమెంట్ లో లేదంటూ ఫిల్మ్ ప్రమోషన్ కు నిరాకరించడం ఏమిటని వారు అంటున్నారు. అగ్రిమెంట్ లో ఉన్నా లేకున్నా భారీ రెమ్యునరేషన్ తీసుకునే నటీనటులకు ప్రమోషన్ వర్క్ లో పాల్గొనే బాధ్యత ఉంటుందని వారంటున్నారు. ఈ క్రమంలో ఛార్మి వాదనను నిర్మాతల మండలి దృష్టికి 'మా' తీసుకు వెళ్తోందని తెలుస్తోంది. అయితే ఛార్మి డిమాండ్ చేసినట్టు నిర్మాత క్షమాపణ చెప్పాలని కోరుతారా? లేకుండా ఇద్దర్నీ కూర్చోపెట్టి సామరస్యపూర్వక పరిష్కారం కనుగొంటారా? అనేది వేచిచూడాల్సి ఉంటుంది.
Be first to comment on this News / Article!
|