ఉగాదికి 'ప్రేమించిన కొత్తలో'
స్నేహానికి, ప్రేమకూ మధ్య ఉన్న తేడాను తెలిపే కథాంశంతో రూపొందిన చిత్రం 'ప్రేమించిన కొత్తలో'. నవదీప్, మల్లికాకపూర్, స్వప్నమాధురి, సజా, సభా అలంఆరా తదిరులు నటించారు. హరిహర దర్శకుడు. ఈనెల 6న ఈ చిత్రం ఆడియో, ఉగాది కానుకగా సినిమా విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాత పి.రామ్ తెలిపారు.
నేటి యువత మనోభావాలకు అద్దంపట్టే విధంగా ఈ చిత్రం ఉంటుందనీ, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇదనీ ఆయన చెప్పారు. హుషారైన ప్రేమికుడుగా, నలుగురు అమ్మాయిల మధ్యన రొమాంటిక్ గా నవదీప్ కనిపిస్తాడని, మల్లికాకపూర్ అందచందాలు, క్లైమాక్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షలుగా నిలుస్తాయనీ తెలిపారు.ఇందులో ప్రకాష్ రాజ్ పవర్ ఫుల్ నెగిటివ్ పాత్రను, ఆశిష్ విద్యార్థి పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించినట్టు చిత్ర నిర్మాణ సారథి సి.హెచ్.వి.ఎస్.ఎన్.బాబ్జీ తెలిపారు. కొండవలస, గౌతంరాజు తదితరుల మధ్య వచ్చే హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతాయని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో విజయ్ కుమార్, మీరాకృష్ణన్, అలెక్స్ తదితరులు నటించారు. మురళీ అబ్బాయి కథ-స్క్రీన్ ప్లే, జయ మాటలు, అనంత్ శ్రీరామ్ పాటలు, సూర్యప్రకాష్ సినిమాటోగ్రఫీ, సూపర్ సుబ్బరాయన్ ఫైట్స్, ముత్యాల నాని ఎడిటింగ్ సత్యం సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|