హైద్రాబాద్ లో 'కోతిమూక'
కృష్ణుడు, శ్రద్ధ ఆర్య జంటగా ప్రముఖ హాస్యనటుడు ఏవీయస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కోతిమూక'. తులసి పూజిత ఫిలిమ్స్ పతాకంపై వెంకట్ జగదీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైద్రాబాద్ లో ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
నిర్మాత వెంకట్ జగదీష్ మాట్లాడుతూ, ఫిబ్రవరి 22న షూటింగ్ ప్రారంభించి ప్రధాన తారగణంతా అంతా పాల్గొంటున్న కీల సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నట్టు చెప్పారు. కృష్ణుడు, శ్రద్ధఆర్య, జయప్రకాష్ రెడ్డి, హేమ, హర్షవర్దన్, గుండు హనుమంతరావు, సుమారు 200 మంది జూనియర్ ఆర్టిస్టులలో నేరెడిమెట్ సమీపంలోని ఓ ప్రైవేటు భవంతిలో కీలక దృశ్యాలను చిత్రీకరించినట్టు చెప్పారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తవుతాయని తెలిపారు. పూర్తి వినోదాత్కంగా ఈ చిత్రం ఉంటుందనీ, ఇప్పటికే 'కోతిమూక' టైటిల్ కు మంచి క్రేజ్ వచ్చిందన్నారు. ఇటీవల 'నువ్వొక పూవుల మాసం' అనే పాటకు సంబంధించి కొన్ని మాంటేజ్ సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో డాక్టర్ బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, ఆహుతి ప్రసాద్, రఘబాబు, కోవైసరళ, ఝాన్సీ, ఉత్తేల, కొండవలస, సత్యం రాజేష్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి జనార్ధన మహర్షి మాటలు, స్వర్గీయ ఆరుద్ర, భాస్కరభట్ల, రామజోగయ్య శాస్త్రి పాటలు, వి.శ్రీనివాసరెడ్డి సినిమాటోగ్రఫీ, ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|