'దేవదాసు' హీరో రామ్ క్రమంగా తనలోని వైవిధ్యమైన నటుడిని ఆవిష్కరించేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే సూపర్ మన్, స్పైడర్ మన్ వంటి గెటప్ లతో చిన్నారులను అలరించిన రామ్ ఇప్పుడు 60 ఏళ్ల వృద్ధుడి గెటప్ లో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'రామ రామ కృష్ణ కృష్ణ' చిత్రంలో రామ్ వేసే గెటప్స్ లో ఇదొకటి. ఇందులో ఆయన తొలిసారి పోలీస్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవల 70 రోజుల పాటు రాజమండ్రిలో ప్రచారార్భాటాలకు దూరంగా షూటింగ్ జరుపుకొంది.
షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటన రామ్ ను ఎంతో థ్రిల్లింగ్ కు గురిచేసిందట. ఈ విషయాన్ని రామ్ తన బ్లాగ్ లో చెప్పుకొచ్చారు. వృద్ధుడి గెటప్ తో రాజమండ్రి వీధుల్లో రామ్ పెరేడే చేసినప్పుడు ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయనను గుర్తుపట్టలేక పోయారట. దీనిని బట్టి రెండు విషయాలు అర్ధం చేసుకోవచ్చు. ఆ గెటప్ లో రామ్ పరకారయ ప్రవేశం చేసి ఉండొచ్చు. మేకప్ మన్ ప్రతిభా పాటవాలు మెచ్చుకోలుగా ఉండొచ్చు. నిజానికి రామ్ గుర్తుపట్టలేనంత ఇదిగా ఆయన వృద్ధుడి గెటప్ ఉందా అనేది తెలుసుకోవాలంటే ఏప్రిల్ నెలాఖరులో సినిమా విడుదలయ్యేంత వరకూ ఆగాల్సిందే. అన్నట్టు ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణికి ఇది 200వ చిత్రం.