'నమో వెంకటేశ' @ 50
విక్టరీ వెంకటేష్ కథానాయకుడుగా సంక్రాంతికి విడుదలైన 'నమో వెంకటేశ' చిత్రం విజయవంతంగా ఈ గురువారంతో 50 రోజులు పూర్తి చేసుకుంటోంది. 122 కేంద్రాల్లో ఈ చిత్రం అర్థ శతదినోత్సవం జరుపుకోనుంది. శ్రీనువైట్ల దర్శకత్వంలో 14 రీల్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ బ్యానర్ నుంచి వచ్చిన తొలి చిత్రమిది. వెంకటేష్ కెరీర్ లోనే 'నమో వెంకటేశ' బిగ్గెస్ట్ హిట్ కావడం. వెంకటేష్-త్రిష కాంబినేషన్ లో 'ఆడవారి మాటలకు అర్థలు వేరులే' తర్వాత వరుసగా ఇది రెండో హిట్ కావడం విశేషం.
తమ సంస్థ తొలి చిత్రం వెంకటేష్ తో చేయడం, వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం సంతోషంగా ఉందని నిర్మాతలు తెలిపారు. 50 నవ్వుల రోజులు పూర్తి చేసుకుంటున్న'నమో వెంకటేశ' ఫ్యామిలీ ప్రేక్షకుల ఆదరణతో ముంజుదుకూ దూసుకుపోతోందని అన్నారు. తమ బ్యానర్ కు తొలి హిట్ ను అందించిన విక్టరీ వెంకటేష, దర్శకుడు శ్రీనువైట్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
Be first to comment on this News / Article!
|