మణిరత్నానికి రంజిత షాక్!
ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్టు సెక్స్ స్కాండిల్ లో చిక్కుకున్న స్వామి నిత్యానంద, నటి రంజిత మాట ఎలాగున్నా, ఆ ప్రభావం ప్రముఖ దర్శకుడు మణిరత్నంపై పడి ఏం చేయాలో తోచక ఆయన తల పట్టుకుంటున్నారు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న 'రావణ్' చిత్రంలో రంజిత కూడా ఓ పాత్ర పోషిస్తుండటమే ఇందుకు కారణం. ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, విక్రమ్, పృధ్వీరాజ్, ప్రియమణి తదితరులతో హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఏడాదిన్నర పైగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే మణిరత్నం ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం, ఆ సినిమాకు 50 శాతం వరకూ పనిచేసిన సినిమాటోగ్రాఫర్ ముందుగా కమిట్ అయిన ప్రాజెక్ట్ కోసం మధ్యలోనే సినిమా నుంచి వెళ్లిపోవడం, ఫారెస్ట్ లో షూటింగ్ సందర్భంగా ఓ మదపుటేనుగు రెచ్చిపోయి మావటిని తొక్కిచంపడం వంటి అవాంతరాలను చవిచూసింది. తాజాగా రంజిత ఆచూకి తెలియకపోవడం మణిరత్నాన్ని పునరాలోచన చేసేలా చేస్తోంది.
రంజితపై ఇప్పటికే కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన మణి మరికొన్ని సన్నివేశాలను ప్లాన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సెక్స్ స్కామ్ లో రంజిత చిక్కుకోవడంతో ఆమె కనిపించకుండా మాయమైంది. దీంతో ఆమె తిరిగొచ్చేంత వరకూ వేచిచూడటమో, వేరే నటితో రంజిత చేసిన సన్నివేశాలన్నింటినీ రీషూట్ చేయడమో మినహాయిస్తే మణిరత్నానికి మరో ఆప్షన్ లేదంటున్నారు.
Be first to comment on this News / Article!
|