|
|
Articles: TP Features | bahujan&ulaku origEdEm&iTi? | |
| వినోద్‌గారు,
తెలంగాణదొరలను ఎదిరించాల్సిన అవసరం ఉన్నమాట నిజమే.నిజాం కాలంలో ఉన్నంతటిబలంలో కూడా వాళ్ళు లేరు.సాయుధ రైతాంగ పోరాటమే వాళ్ళకోరలు తీసేసింది.అందుకే కారంచేడు వంటి సంఘటనలు వాళ్ల దగ్గర జరుగుతున్నయి,కన్ని మనదగ్గర కాదు.93 శాతం ఉన్న బహుజనులు ఇపుడు నడుస్తున్న తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములుగా లేరన్నట్లు మీరుచెప్పడంలో తెలంగాణవ్యతిరేకుల ప్రోద్భలం ఉందేమో ఉందేమోననిపిస్తున్నది.
610 జీ.ఓ అమలైతే తెలంగాణ అగ్రకులాలేఎగరేసుకు పోతాయా?
ఇప్పుడున్న సమైక్య రాష్ట్రంలో 93 శాతం బహుజనులకు అన్యాయాలు జరగడంలేదా?తమకు రావాలసిన వాటాలు దక్కుతున్నాయా?
తెలంగాణలో జరిగిన ,జరుగుతున్న ఆత్మహత్యలకుగాని,గిరిజనులు పిల్లలనమ్ముకోవడానికిగాని,కొందరు స్త్రీలు బతుకుతెరవులేక వ్యభిచారంలో కూరుకు ఫొవడానికిగాని సమైక్యాంధ్రలో నీగ్రకులాలు (అధికారంలో ఉన్న వర్గాలు) ఎంతమాత్రం కారణంకాదనుకుంటున్నారా? తెలంగాణకు వ్యతిరేకంగా రాయడం ఏటిలోపది కొట్టుకు పోవడం వంటిది.దానికిపెద్ద శ్రమ అక్కరలేదు,సాహసమూ అక్కరలేదు.ప్రవాహంలో పడితేచాలు,అప్రయత్నగానే ఎంతోదూరం ప్రయాణించగలము.ఉద్యమకారులతోభుజం,భుజం కలిపి పోరాడ డానికే అన్నీ కావాలి.అది ఏటికి ఎదురీదడం లాంటిది.తెలంగాణ ఏర్పడిన పిదప ఇక్కడి అధికారగణాలకు వ్యతిరేకంగా ఇంకా ఎన్నో పోరాటాలు చెయ్య వలసిన అవసరం ఉంటుందనడం మాత్రంఎవరూ కాదనలేని వాస్థవం. అందుకే జీవితమంటే అంతులేనిఒక పోరాటం అని ఒక కవిగారన్నది.
Posted by: Mr. ramulu ch At: 10, Mar 2008 9:58:16 AM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|