|
|
Articles: My Thoughts | telugupaTla m&eisUr#` saMstha vivaKsha | |
| ఎ బి కె ప్రసాద్ గారికి,
ముందుగా...మీరు మన భాష కు చేస్తున్న కృషికి పాదాభివందనం.
మీరు మీ పరిధిని దాటి కొంచెం ముందుకు వెల్లి కృషిచేయాల్సిన అవసరం ఈదినం ఏర్పడింది.
కొన్ని విషయాలను దయచేసి కొంచెం ఆలోచించండి,
ఇంకో 5 సంవత్సరాల్లొ కనక మనం పరిస్థితులను మార్చనట్టయితె ఇంక మార్చాల్సిన అవసరం ఉండదు.
ఇటీవల కొందరు తమ కుల(లేదా ఆ కుల నాయకుల) అవసరాలకు శాసనసభపై దాడి చేసి
మొత్తం అందరి దృష్టిని తమవైపు తిప్పుకున్నారు... నిజానికి అది పెద్ద నేరం, కాని మన ప్రభుత్వాధీశులు రాబొయె ఎన్నికలను మదిలొ ఉంచుకొని ఏమీ జరగనట్టు వూరుకున్నారు.
మీరు మెత్తగా ఉండి, ప్రభుత్వం అది చేయాలి, ఇది చేయాలి అంటూ కేవలం పత్రికా ప్రకటనలతో సరిపుచ్చితే ఒరిగేదేమీ ఉండదు. వారికి వారి స్వార్థం ముఖ్యం, పదవి ముఖ్యం, రాజ్యాధికారం ముఖ్యం.
తెలుగు భాష ఏమైపొతే వారికేం?
వారు దిగి వచ్చి చెప్పినట్టు చెయాలంటె.... మీరు మీ పంథా మార్చుకోవాలి.
కవులను, కళాకారులను, రాజకీయనాయకులను, ఉన్నతోద్యొగులను, వ్యాపారవెత్తలను,
అన్ని మతాల మతాధిపతులను, పీఠాధిపతులను, కుల పెద్దలను..... మరీ ముఖ్యంగా
యువతను అంటే అన్ని విశ్వవిద్యాలయాలలొ చదువుతున్న తెలుగు మీడియం విద్యార్థులను,
అధ్యాపకులను, పాఠశాల ఉపాధ్యాయులను .... ఒకే వేదికపైకి రప్పించంది.
పత్రికాధిపతులను, టి.వి. చానెల్ల అధిపతులను, మహిళా నాయకులను, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలను ఈ విషయం పై వారు ఏమి చెయగలరో చెప్పించండి.
భాష కు ఏమైనా చెయాలంటె ఇలా ముందుకు వెల్లాలని మీకు చేసే ప్రార్ఠన మాత్రమే ఇది.
కొన్ని దినాలలోనే మీకు లభిస్తున్న స్పందనకు అన్ని రాజకీయ పార్టీలకు మన భాషకు పునర్ వైభవం ఎలాచేయాలో అలొచించక తప్పని పరిస్థితి ఏర్పడి తీరుతుంది.
తప్పులుంటే క్షమించండి.
మీ,
చెన్నకేశవస్వామి.
మా బ్లాగు ను చూడగలరు.
teluguchaitanyam.blogspot.com
Posted by: Mr. chennakeshavaswami telugu At: 20, Feb 2009 4:50:11 PM IST telugu mIda prEma unnavALLaMtA mukta kaMThaMtO KaMDiMchAlsina vishayaM idi...
Posted by: Bullibasu Bullibasu At: 24, Sep 2008 8:47:11 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|