|
|
Articles: TP Features | reMDO essArsIki raMgaM | |
| కాంగ్రేస్ నిజంగా రెండవ ఎస్సార్ సి ని వేసినా ,వెయ్యకుండానే రాజకీయం చెయ్యాలని చూసినా రెండూ నష్టదాయకంగానే పరిణమించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.అసలు తెలంగాణ ఉద్యమాన్ని బ్రష్టు పట్టించడానికే 2వ ఎస్సార్‌సీ మంత్రమనేది తెలంగాణ ఉద్యమకారులకు తెలిసిపోయింది.2వ ఎస్సర్‌సి వేస్తాము , అది అంగీకరిస్తే / రికమండ్ చేస్తే తెలంగాణ ఇస్తాము అని ప్రజలను ఊరించే లక్ష్యంతో కాంగ్రేసువారు ఆమంత్రం జపిస్తున్నారు. ముఖ్యంగా వచ్చే సాధారణ ఎన్నికలవరకు దాన్ని సాగదీసి ఫొయిన ఎన్నికల్లో తెలంగాణ ఇస్తామని ఓట్లను మూటగట్టుకున్నట్లుగా మళ్ళీ మూటగట్టుకుందామని చూస్తున్నారు.అయితే ఈసారి ఆకారణంగా (2వేసార్‌సి పేరుజెప్పి) ఎక్కువ ఓట్లు వచ్చేదటుంచి ఇప్పటికి చేసిన కరెంటు బిల్లుల మాఫీ,ఎత్తిపోతల పధకాలవల్ల తెలంగాణలో ఎంతోకొంత వచ్చిన మంచిపేరుగూడా పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది.అసలు 2వ ఎస్సార్‌సిని కాంగ్రేసులోని తెలంగాణవాళ్ళే నమ్మనప్పుడు ప్రజలను అంటే ఓటర్‌లను ఎలా నమ్మించగలుతారు? అనేది ముఖ్యమైన ప్రశ్న.
కరీంనగర్ ఎన్నికలకు ముందు వయ్యెస్సర్ ఒక మంచి ఎత్తుగడ తోనే అక్కడి గెలుపు ఓటములను రెఫరెండంగా పరిగణిస్తామని మొదట ప్రకటించి ,ప్రచారంచేసుకున్నారు. తెరాస ఓడితే తెలంగాణ ఉద్యమాన్ని అంతంచేయడం సులభమౌతుందని ధ్రుడంగా ఆశించారు.కాంగ్రేసు ఖచ్చితంగ గెలిచే అవకాశాలు మ్రుగ్యమైనంకనే దాన్ని మళ్ళీ ప్రస్తావించడం మానుకున్నారు.అందువల్ల కేసీఆర్ గెలుపుకు తనకు తెలియకుండానే వయ్యెస్సార్ హస్తం ప్రచ్చన్నంగా అందించారు.ఇది కూడా అందరికి తెలిసిన విషయమే.రెండవ ఎస్సార్‌సీ కూడా తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలువడానికి రెఫరెండం వంటి ఒకానొక ఎత్తుగడే. కొన్ని తెలంగాణకు వ్యతిరేకంగ నష్టం కలిగించే పనులు కాంగ్రేసు చేసినా కొన్ని తెలంగాణవారికి ఇష్టపడే /కావాలనికోరుకునే పనులు చేశారు కాబట్టి గెలుస్తారోఏమో కాని ఈఎస్సార్‌సీ మంత్రం వల్ల మాత్రం కాబోదు అనేది నిశ్చయంగా చెప్పవచ్చు.అంటే ఎట్టిపరిస్తితుల్లో ఎస్సార్‌సి పేరుతోని అదనపు ఓట్లను సంపాదించే అవకాశం లేదు. అదికాక 2వ ఎస్సార్‌సీ కాంగ్రేసుకు కేంద్రంలో తలనొప్పులను మాత్రం ఈవ్యాస రచయిత ఖోస్లగారు చెప్పినట్లుగా తెచ్చే అవకాశాలు మాత్రం మెండుగా కనిపిస్తున్నాయి.
Posted by: Mr. ramulu ch At: 17, Aug 2007 3:08:58 AM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|