|
|
Articles: My Thoughts | పంచ సూత్రాలు - madhavi pallam
| |
తేనె కన్నా తియ్యన తెలుగు భాష. ఈ మాధుర్యం చిన్నారికి అమ్మ పాడే లాలిపాటలా, 'చందమామ రావే' అంటూ తల్లి చూపించే జాబిలి వెన్నెలంత హాయిగా ఉంటుంది. ఏమిటి ఈ కవితా వర్ణనలు అనుకుంటున్నారా? నిజమే ఈ నాటి తరానికి పరిచయం లేని వింత లోకం...
అంతా ఎందుకని, కంఫ్యూటర్ యుగం - ఇంటర్ నెట్ జగం, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. సంపాదనే ధ్యేయంగా మారింది జీవితం. ర్యాంకుల పోటీలో చిన్నా పెద్దల పోరాటం. చదువుల ప్రయోజనం విజ్ఞానార్జన నాడు. ఉద్యోగ పర్వతాన్నధిరోహించే మెట్లు నేడు...
ఎంసెట్, ఈ సెట్.. పోటీ పరీక్షలలో బాల్యం కొట్టుకుపోతుంటే తెలుగుకు చోటెక్కడిది? మన తెలుగు భాషా - సంస్కృతి విదేశీయులకు నచ్చుతుంది. కాని మనకు విదేశీ సాంప్రదాయంపై మోజు పెరుగుతుంది. ఎందులో మాతృభాషలో మాట్లాడటం నామోషిగా భావించి, ఆంగ్లభాషలో సంభాషించడం గొప్పగా భావించడం ఎంతవరకూ సమంజసం?
తెలుగు పదాల కమ్మదనం తెలియాలంటే మాతృదేశానికి దూరంగా ఉంటున్న ప్రవాస భారతీయులను పలకరిస్తే తెలుస్తుంది. తెలుగు పలకరింతకై ఎంత ఆర్తిగా ఎదురుచూస్తున్నారో తెలుస్తుంది. విదేశాలలో ఉన్న భారతీయులు తెలుగు సంఘాలుగా ఏర్పడి తెలుగును పిల్లలకి నేర్పుతూ, పండుగలు జరుపుకుంటూ- సాహిత్య. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగు భాషా - సంస్కృతి-సాంప్రదాయాలను గౌరవిస్తున్నారు.
మన వంతు కర్తవ్యంగా మనమంతా కూడా మాతృభాషను గౌరవిస్తూ, భావితరాలకు తెలుగు భాషను అందించే ప్రయత్నం చేద్దాం.
1) ఇంట్లో తెలుగులోని పిలుచుకోవాలి
2) కార్యాలయాల్లో, చట్ట సభల్లో.. ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అన్ని పత్రాలనూ తెలుగులోనే రాయాలి
3) నలుగురు కలసిన వేళ తెలుగులోని పలకరించాలి
4) సంతకం చేసేటపుడు తెలుగులోనే సంతకం చేయాలి
5) విధానసభ - రాజ్యసభ, పాఠశాలలు, కళాశాలలో, కార్యాలయాలలో వారానికి ఒక రోజు తెలుగుదనం ఉట్టిపడే సంప్రదాయ వస్త్రధారణ..
ఈ పంచ సూత్రాలను ప్రతి ఒక్కరూ పాటిస్తూ - తెలుగు భాషా, సంస్కృతీ, సంప్రదాయాలు చిరంజీవిగా వర్ధిల్లేలా మనమంతా మనస్ఫూర్తిగా కృషి చేయడానికి కంకణబద్ధులం కావాలి.
ప్రజలు, ప్రభుత్వం, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటించిన ఐఖ్యరాజ్య సమితి అంచనాలను తల్లక్రిందులు చేసి కొత్త ప్రగతిని చూపగలం. భవితకు తెలుగు భాష - సంస్కృతి - సంప్రదాయాలను అందించి, వారికి ఆదర్శంగా నిలుద్దాం.
తెలుగు భాషా - జాగృతి అంటూ సభలు, సమావేశాల వరకే పరిమితం కాక ప్రజలలో చైతన్య కలిగేలా కృషి చేద్దాం.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|