|
|
Articles: Devotion | శిరిడి దర్శిని - 3 - Mrs. seetha suri
| |
( కట్టడా - రైలింగ్) : ఇది బాబా చిత్ర పటానికి ఎడమ ప్రక్కన ఉన్నది. ఎవరైనా మానసికంగా ఇబ్బందులున్నవారు ఈ కట్టడాకు తల ఆనించి నిలబడితే వారి మానసిక ఒత్తిడులు ఆ బాబా కృప వలన తొలగిపోతాయని నమ్మకం.
ఊది స్టాండ్ : ఈ రైలింగ్ పైనే ఊది స్టాండ్ ఏర్పాటు ఉంది. ఊది అనగా ఒక అర్థం క్షేమంగా వెళ్ళి రండి అని ఉన్నది. అలాగే ఊదికి మరో అర్థం ఏమంటే బూడిద. బాబా ప్రతివారికి వారి జీవితాల్లో సుఖ శాంతులు పొంది తరించాలని ఆకాంక్షిస్తూ ఈ ఊదిని మహా ప్రసాదంగా ఇచ్చేవారు. దాని మీద ఈ అగర్బత్తి స్టాండ్ అమర్చారు.
మసీదు అగర్బత్తి స్టాండ్ : కట్టడా ముందు ఒక చిన్న అరుగు ఉన్నది. ముఖ్యద్వారం కుడి పక్కనే ఉన్నది.
తులసి బృందావనం : బాబాకు తులసి అంటే ఎంతో ఇష్టం. మసీదు బయట ఆవరణలో ఆయన తులసిచెట్లను చక్కగా పెంచి బృందావనంగా తీర్చిదిద్దేవారు. సూర్యరశ్మి సరిగా శోకనందున ఈ బృందావనం నేడు ఒక చిన్న కోటాకే సొంతమైనది.
సభా ప్రాంగణానికి మధ్యనున్న తాబేలు : ముఖ్యంగా తాబేలు విష్ణుమూర్తి అవతారం. భక్తి, ప్రేమ, శ్రధ్ధ, ప్రపత్తులకు చిహ్నం.
ఎవరైనా గాని ఈ తాబేలుని చూసి నేర్చుకొనవలసినది ఎంతో ఉంది. అందులో శిరస్సు వంచి నమస్కరించే విధానం అది గొప్పది. అలాగే వినయ విధేయతలకు పేరు మోసిన వీటి గమనాన్ని పరిశీలిస్తే గర్వం నశిస్తుంది. బాబా చెప్పిన ఏకాదశ సూత్రాలలోని ఎనిమిదవ సూత్రం ఈ తాబేలుననుసరించే చెప్పారు. ప్రతిరోజు ఆలయ పూజారి ఈ తాబేలుకు కాకడ హారతికి ముందు, మధ్యాహ్న హారతికి ముందు ఆస్త గంధంతో సేవించి పూజిస్తారు.
బాబా కూర్చున్న శిలావేదిక : ఈ శిల ఇప్పటికీ ద్వారకామాయికి తూర్పు వైపున గోడకు ఆనించి అమర్చబడి ఉన్నది. బాబా మహా సమధ్ అనంతరం బాబా పాదుకలు ఈ శిల పైన అమర్చారు.
శిలా వేదికపైన ఉన్న బాబా చిత్రపటం : ఈ చిత్ర పటంలో ఉన్న ప్రత్యేకత ఏమంటే బాబా చెప్పిన ఏకాదశి సూత్రాలలోని ఒక సూత్రం అయిన నా యందు ఎవరు చూచిన వారి యందె నా కటాక్షం కలదు అన్న మాటలు నిక్షిప్తం చేసి ఉన్నాయి.
శ్యామ కర్ణ : బాబా ఈ చిత్ర పటం కుడి ప్రక్కన పాలరాతి గుర్రం బొమ్మ ఉంది. ఈ గుర్రం బాబాకు అత్యంత ప్రేమ పాత్రమైనది. ఈ గుర్రం విధివశాత్తు 1945 లో మరణించింది. దీనికి సమాధి లెండి బాఘ్లో ఏర్పాటు చేశారు. ఈ గుర్రం ఆభరణాలు, కాళ్ళ గజ్జెలు, జరీ బట్టలు , జీనూ అన్నీ శ్యామ సుందర హాలులో భద్రపరిచి ఉన్నాయి. ఈ హాలు ద్వారకామాయికి తూర్పు దిశలో ఉన్నది.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|