TeluguPeople
  are the trend-setters

 
Articles: My Thoughts
మొర విను గోపాలా!
- Mrs. Padma Sreeram V.
  Page: 1 of 2   Next > >  
To : Gopala@dwaraka.com స్వామీ! ఇంటర్నెట్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొన్న యాంటీవైరస్ ట్రయల్ పిరియడ్ అయిపోయింది. కాబట్టి నీ ఫొటోను వాల్ పేపర్ గా పెట్టుకొన్నా. ఇంక సిటీలో పిలవకపోయినా వచ్చి తిష్టేసే అతిథుల్లాంటి వైరస్ ల బారి నుంచి నా సిష్టంనూ నా డేటాను కాపాడే పూచీ నీదే. (తేడా వస్తే రాధమ్మతో చెపుతానయ్యా మన్నించు మరి నాకు వేరే దారిలేదు) స్వామీ! నీకు ఎంతో ఇష్టమైన అటుకులు కుచేలుడు ఇస్తే తిన్నావు. అంతులేని సంపదను అతనికిచ్చావు. నీకు నేను కూడా స్కైపేక్ కొరియర్ ద్వారా దొడ్డటుకులో, సన్నటుకులో పంపుతాను. నన్ను వరల్డ్ రిచ్చెస్ట్ పీపుల్ లిస్ట్ లో 12345 వ వ్యక్తిగా చేర్చు (టేక్స్ మాత్రం ఉండకూడదు సుమీ). స్వామీ! శిశుపాలుడికి నీ సమవయస్కుడు కాన 100 తప్పుల వరమిచ్చావు. కానీ మేము అతి చిన్నవాళ్ళం మాకు ఆ అంకె చాలదు. నావి 654321 తప్పులు క్షమించు. ఇప్పటికి జనాలపై అలిగీ అలక్క ఇందులో సగమో ఇంకొన్నో చేసే ఉంటాను.(మిగతావి చేసేలోపూ ఎలానూ పోతాను) స్వామీ! నువ్వు గీతలో చెప్పినట్లు ఇప్పటికీ నీ గవర్నమెంటులో మరణించినవారికి మళ్ళి జన్మ తప్పకుండా ఉంటే, నన్ను మళ్ళీ మా తణుకులోనే పుట్టించు. వేరే ఊరైతే దారి తెలియక కంగారుపడతా. అప్పుడు ఇల్లు చేరకుండానే నిన్ను చేరాల్సొస్తుంది. స్వామీ! నువ్వు మీ అమ్మకు 14 లోకాలు చూపించావు. మొన్న దీపావళికి ముందు 72ఎం బస్ లో నా బేగ్ లోంచి 10,000/- పోయాయి. అన్నీ 500/- నోట్లే . అది ఖచ్చితంగా నా పక్కన కూర్చొన్న కాలేజీ అమ్మాయే తీసుంటుంది. ఆడపిల్ల కదా అని నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టి (నేనా అమ్మాయి ముఖం మర్చిపోయాను) ఆ పిల్ల మనసు మార్చి నా సొమ్ము నాకిచ్చేట్టు చూడు. స్వామీ! నీకు లోకువ కాబట్టి అర్జునుడికి భగవద్గీత మొత్తం వినిపించేసావ్. కాని నా మంగళసూత్రం , మా అత్తగారు నే చెప్పేదేదీ వినట్లేదు. వాళ్ళకు ఓ పాలి నచ్చచెప్పి చూద్దూ. స్వామీ! నువ్వు దేవుడివి కాబట్టి ఇద్దరే ముఖ్య స్నేహితులైనా సరిపెట్టుకొన్నావ్. కానీ మేము మనుష్యులం కదా! మాకు ప్రపంచంలో మంచివారందరినీ స్నేహితులుగా మలిచెయ్యి. వాళ్ళల్లో నువ్వూ ఉంటానన్నా నో ప్రోబ్లమ్.

Read 1 Comment(s) posted so far on this Article!

  Page: 1 of 2   Next > >  



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.