|
|
Articles: Poetry | కనులు - మనసు - Dr. Naraparaju Kishore Kumar
| |
కనులు రెప్పల చాటున దాగినంత మాత్రాన
మనసు వీక్షించడం మానదు!
రెప్పగారి అనుమతి కనులకు లభించినా
మనసుని మైకం నుండి మరల్చలేవు!
అసత్యం కనులను భ్రమింప జేసినా
మనసు తలుపులను తెరువజాలదు!
సున్నితత్వం కనులకు కానరాకపోయినా
మనసు ఆహ్వానం పొందక మానదు!
తీక్షణ వెలుగు రేఖలను కనులు తాళలేకున్నా
మనసు వాకిట ఆ రేఖలే ముగ్గులాయేను!
నిశరేతిరి కనులకు చీకట్లు నింపినా
మనసు లోతుల్లో హాయి అనే వెలుగులు నింపేను!
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|