|
|
Articles: Poetry | మృగాలూ ఆవులవుతాయి - Dr. rangarao raavi
| |
గొడ్డలితో నరుకుతుంటే
చెట్టు చిగురుతో
తిరుగుబాటు చేస్తుంది
నిశ్శబ్దంగా
నిర్మలంగా
ఆశయంగా
ఆచరణగా...
వాడు కత్తితో వస్తే
నువ్వు నవ్వుతో పలకరిస్తే
చిరునవ్వుల విత్తనాలు
హంతకుడి రాతి గుండెలో
కొత్త మొక్కలై మొలుస్తాయి...
కోటి పూలు పూస్తాయి...
చిగురుల చిరునవ్వుల ముందు
కత్తులైనా తుపాకులైనా
పాలపొదుగులవ్వాల్సిందే,
పంచదార వాన కురవాల్సిందే.
| Read 4 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|