TeluguPeople
  are the trend-setters

 
Articles: Short Stories
saMkraaMti kaanuka
- Mr. Jagannadha Rao LakshmiPrasad
  Page: 1 of 1    
మకర సంక్రాంతి వచ్చిందంటే కొత్త అల్లుళ్ళు అత్తవారిళ్ళకు చేరుకోవడం పండుగ సంబరాల్లో భాగమే. అలా చేరుకున్నవాడే మన కమరేష్. అబ్బో! మీ కెంత మడి అల్లుడుగారూ! పొద్దున్నే పేపరు కుర్రాడు గిరవాటేసిన వార్తా పత్రికమీద నీళ్ళు జల్లుతున్నారు అంది అత్తగారు. ఈ పేపరు నిండా ఒకరిమీద ఒకరు బురద జల్లుకోవడమే గదండీ. అందుకే ఇలాగైనా కొంత బురద వదుల్తుందనీ అన్నాడు మకరేష్. మరే నాయనా! మీ మామగారు కూడా చెప్పేరు. ఈ మధ్య సత్యం మీద కూడా బురద చల్లుతున్నారటగా? అవునండీ! మన తెలుగువాడే మేకల అంజయ్య యూరప్ కి వెళ్ళి అక్కడ మైకెలాంజెలో అయ్యేట్ట. అలాగ SATYAM ని తిరగేస్తే వచ్చిన MAYTAS కూడా సత్యంని తిరగేసేసింది కదండీ. పైగా వినాలే వినాలే అనే అమెరికన్ కంపెనీ సత్యం మీద దావా వేసినా ఎవరూ వినలేదట. ఈ పత్రికలో రాసేరండీ సత్యం శివం స్కాండలం అని. అయినా ఇప్పుడు వీటిని కిలో రెండు రూపాయలకే అమ్ముతున్నారండీ. కిలో రెండ్రూపాయల బియ్యం పథకం ఎప్పట్నించో ఉంది కదా నాయానా? నేను చెప్పేది కిలో రెండ్రూపాయలకే అమ్మే వార్తా పత్రిక గురించి అత్తగారూ అంటే ఇది వంద రూపాయలకే వంట సరుకు పధకంలాంటిదన్నమాట ఇంతలో మకరేష్ భార్య సత్య వచ్చి 'పండుగ పూట, త్వరగా తలంటు స్నానం చేయిస్తాను రండి. ఊళ్ళోని గుడికి వెళ్ళొద్దాం' సత్యకాలపు గుళ్లు ఎందుకు పనికివస్తాయి సత్యా! కళ్లు మూసుకుని దండం పెట్టుకోవడానికి తప్ప. దానికంటే రెండు రసాలు, పంచ రసాలు, నవ రసాలొలికించే టీవీ చానెళ్ళు చూడ్డం నయం.నా ఉద్యోగంలో ఐదు రోజులపాటు నాశరీరం యజమానుల సేవచేసే కోవెల. వారాంతపు రెండు రోజులూ అమ్యూజ్ మెంటు పార్కు కదా అన్నాడు మకరేష్. ఇంతకీ అమ్మాయి చెప్పిన విషయం నిజమేనా? అడిగేరు అత్తగారు మకరేష్ ని. ఏ విషయమండీ? అని ప్రశ్నిస్తూ, అనుమానంగా చూసేడు సత్యకేసి. నువ్వు భుజాలేం తడుముకోనక్కర్లేదు నాయనా. నువ్వేమీ గుమ్మడి కాయల దొంగవి కావుగదా. అదే పండక్కి నువ్వు మామగార్ని కానుక ఇమ్మని అడగాలునుంటున్నావటగా? నీకు ఏ కంపెనీ స్కూటరు ఇష్టం నాయనా? ఇప్పుడు స్కూటరు ఎందుకు లెండి, నేను CENTRINO CORE 2 DUO LAPTOP కొనుక్కోవాలని ఎప్పట్నుంచో నా కోరిక. నువ్వు కొనుక్కోవాలనేదే నీ కోరికైతే అంతకంటే భాగ్యమా నాయనా? అది కాదండీ. ఇచ్చేదేదో మామగారి చేతుల మీదుగా ఇప్పిస్తే బాగుంటుందని అన్నాడు మకరేష్. అదా నాయనా సంగతీ? అలిగి మీ పుట్టింటికి వెళ్ళడానికి నువ్వేం ఇల్లరికపుటల్లుడివి కావుగా? ఇప్పుడు మా తోటలన్నీ సెజ్జార్పణం అయిపోయేయి మరి. ఇప్పుడిక నువ్వడిగింది కొనగలరో లేరో? మకరేష్ మొహం కేబులు కనెక్షన్ తీసేసిన టీవీలా తయారయింది.

Be first to comment on this Article!

  Page: 1 of 1    



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.