|
|
Articles: Poetry | ఎండమావులు .... - Mr. Sri Sri
| |
మల్లెపూవుకి గలదు
మనసు మెచ్చే పరిమళం
సుతిమెత్తనిది
కొమలిదీ కనకాంబరం..
అందమైన పుష్పాలు ముల్లంటే ఎరగవు...
ముల్లున్న గులాబియే నీవు మెచ్చిన కుసుమం
దైవమిచ్చిన దారి ఒకటి
నీవెంచిన దారి ఒకటి
పూర్తి స్వేచ్చనిచ్చాడు,
భుజం తట్టి పంపాడు
గమ్యం అంటూ వచ్చేసరికి,
కుయ్యో మొర్రో అన్నావు
హాయిగ మజిలీ చేసేటపుడు,
అదుగులు తనవీ ఉన్నాయి
కష్టాలపుడు కన్నీరపుడు
అడుగులు తనవి కనపడలేదు
ఒంటరినైతిని అనుకున్నావు,
మోసం చేశాడన్నావు
కాని అడుగులు తనవే అన్నాడు,
నిన్ను తన భుజములపై ఎత్తుకున్నాడు...
పసిపాపల బోసినవ్వులు,
సెలయేరుల గలగలలు,
తల్లి ప్రేమ కమ్మదనం,
తెలుగుభాష తీయదనం
చూసుకొనుటకీ కనులు,
అనుభవించుటకీ మనసు
అందించిన జీవితానికి
శతకోటి వందనాలు !!
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|