|
|
Articles: Poetry | గోధూళి వేళ... - Mr. Sri Sri
| |

గోధూళి వేళ
గోదావరీ తీరం
నీ కై నేను
వెతుకుతున్నాను
ఎగసే ప్రతి అల
నా ఆశకి ఊపిరి పోస్తోంది
మన కలయిక సత్యమని
పదే పదే చెబుతోంది
చిన్న నాటి స్నేహం
మరువలేక పోయాను
మదిలో నీ రూపం
చెరపలేక పోయాను
చెరగని నీ నవ్వు
నన్నిన్ని నాళ్ళు నడిపింది
తరగని నా ప్రేమ
కొత్త ఊపిరి పోసింది
నీ ఉనికి చేసిన మనిషి
నీ తోడుకై వస్తోంది
లోకంలోని సంతోషాలని
దోసిట్లో తెస్తోంది
కరిగే కాలమా
చేయుమా ఒక సాయం
చెలి చెంతకి చేరేవరకు
నిలుపుమా నీ పయనం
ఎద తొలిచే విరహమా
మాట ఒకటి వింటావా
చెలి చూపు సోకేవరకు
మదిని విడిచిపెడతావా
ఈ వెలుగు వలే నా ఆశ
చీకట్లో కలిసేనా
లేక నడిచొచ్చే వెన్నెలై
తను కొత్త వెలుగు నింపునా ???
| Read 6 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|