|
|
Articles: Poetry | మంచు - Dr. Naraparaju Kishore Kumar
| |
ఆకురాలిన కాలంలో శ్వేతపత్రాలు
చెట్లనిండా దర్శనమిచ్చాయి.
అటుగా వీచిన పవనానికి ఆ శ్వేతపత్రాలు
మీద రాలి నేల తడిసి ముద్ద అయ్యింది.
సూర్యకాంతి ధాటికి నిలువ లేక ఆ శ్వేతపత్రాలు
టపటప నీటి బిందువులై నేలరాలాయి.
ఆ శ్వేతవర్ణపు పత్రాలు మరేవీ కాదు.
ఆకాశం మురిసి కురిసిన మంచుబిందువులు
నేలతాకుతూ, చలితో గిలిగింతలు పెడుతూ
శ్వేతవర్ణంతో నేల అంతా ఆ మంచు ఆవహించింది.
చెట్ల ఆకులూ తెలుపే
పచ్చిక పరుపులూ తెలుపే
కొండలు, కోనలు, సెలయేర్లు,
తెలుపు ముసుగు వేసుకొని
తమ స్వచ్ఛతను తెలుప సాగాయి.
మంచితనంతో ప్రపంచంలో శాంతిని
నింపాలని సందేశమిస్తూ ఆకాశదూతలా
అశాంతితో వేడెక్కిన ఈ భూమిని
చల్లబరుస్తూ కురిసింది ఈ మంచు.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|