|
|
Articles: Poetry | నేను! - Dr. Naraparaju Kishore Kumar
| |
ఈ నేను అందరిలో 'నేనే'
కొందరికి మెత్తగా
కొందరికి కఠినంగా
తారసపడే నాలోని 'నేను'
ఈ కవితా రూపంలో
వ్యక్త పరచే ప్రయత్నం చేస్తున్నాను.
నేను నవ్వులు చిందిస్తాను
నిప్పులూ కురిపిస్తాను!
నేను హాయినిచ్చే శీతలపవనాన్ని
మాడ్చివేసే వడగాలి వీచికని!
ఇట్టే కరిగే వెన్నని
చలనం లేని శిలని!
ప్రభాత కిరణాన్ని
చిమ్మచీకటిని!
చల్లని వెన్నెలని
చంఢప్రచంఢ సూర్యకిరణాన్ని!
పిల్ల కాలువను
మహాసంద్రాన్ని!
అందివచ్చిన అవకాశాన్ని
పొంచి ఉన్న ప్రమాదాన్ని!
సుతిమెత్తని తివాచీని
నడువజాలని ముళ్ళబాటని!
మధురమయిన సంగీతాన్ని
భయోత్పాత ప్రళయ ఘోషను!
నా గుండె లోతుల్లో
ప్రణయం కనిపిస్తుంది
ప్రళయం గోచరిస్తుంది.
అర్ధమయ్యే ఓ సిద్ధాంతాన్ని!
అంతుబట్టని ఓ వేదాంతాన్ని!
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|