TeluguPeople
  are the trend-setters

 
Articles: TP Features
'గొట్టాల' విప్లవం!
- Mr. Narsing rao D
  Page: 1 of 3   Next > >  
'తుపాకీ గొట్టం ద్వారానే విప్లవం సాధ్యం'... మావోయిస్టులు నోరు విప్పితే మొదటిగా వినిపించే నినాదం ఇది. ఆంధ్రప్రదేశ్ లో ఈ నినాదం నాలుగు దశాబ్దాలుగా వింటున్నదే. అయినా అడవుల్లో తప్ప మరెక్కడా విప్లవం జాడ లేదు. తుపాకీ గొట్టాలు క్రమంగా మూగబోతుండగా ఇప్పుడు రాష్ట్రంలో మరో రకం 'గొట్టాల' విప్లవం ప్రారంభమైంది. అవే తెలుగు వార్తా టెలివిజన్ చానళ్ళు. వీరినే 'గొట్టాల' బ్యాచ్ అంటూ రాజకీయ నాయకులు ముద్దుగా పిలుచుకుంటారు. ఎవరు కనిపిస్తే వారి దగ్గరకు మైక్ లు పట్టుకుని పరుగులు తీసే ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ఇది సంక్షిప్త నామం అయింది. ఆ మధ్య అసెంబ్లీలో మాట్లాడుతూ, సాక్షాత్తు ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అంతటి వాడే ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను ఉద్దేశించి 'గొట్టాలోళ్ళు' అని సంబోధించారు. మరీ ఇంత నికృష్ణమైన పేరు ఏంటి అంటూ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ముఖ్యమంత్రిపై పరోక్షంగా రుసరుసలాడారు (ఇంకా నయం 'గొట్టంగాళ్ళు' అననందుకు సంతోషించాలేమో). ఏదైతేనేం జనసామాన్యంలో సైతం 'గొట్టం' వారి ఇంటి పేరుగా మారిపోయింది. ఎవరు ఏమని పిలిస్తే ఏంటి.... ఈ రోజు చేతిలో గొట్టం ఉన్నవాడిదే హవా. ప్రైవేట్ టివి చానల్స్ నిరంతరం వార్తా ప్రసారాలలోకి అడుగు పెట్టక ముందు వరకు వార్తల కోసం ప్రభుత్వ ప్రసార మాధ్యమం అయిన దూరదర్శనే దిక్కుగా ఉండేది. చూపు ఆనక, వినికిడి కోల్పోయి కదలలేని దీనావస్థలో ఉన్న వృద్ధుడి అవస్థను తలపించేంది దూరదర్శన్. అయినప్పటికీ జనానికి అదే దిక్కు అయింది. ప్రైవేట్ టివి చానల్స్ తెలుగు ప్రేక్షకులను పరమ బీభత్సమైన డైలీ సీరియల్స్ ద్వారా వినోదంలో ముంచి తేలుస్తున్న రోజులవి. వార్తా ప్రసారాల కోసం ప్రజలు నమ్ముకున్న దూరదర్శన్ ప్రభుత్వ సేవలో తరిస్తున్న రోజులు కూడా. సరిగ్గా ఆ సమయంలోనే ఈనాడు టెలివిజన్ ఈటీవి 2 పేరిట వార్తా ప్రసారాల కోసం ప్రత్యేక చానల్ ప్రారంభించింది. అతి తక్కువ కాలంలోనే ప్రజల ఆదరాభిమానాలను సంపాదించుకొంది. మరికొద్ది కాలానికి 'మెరుగైన సమాజం కోసం' అంటూ ప్రారంభమైన టివి 9 నిరంతర వార్తా స్రవంతి తెలుగునాట సంచలనమే అయింది. కేబుల్ టీవీ వార్తలకు భిన్నంగా బిబిసి, ఎన్డీటీవి తరహాలో ఈ రెండు చానల్స్ ప్రారంభించిన వార్తల యజ్ఞంతో తెలుగు రాష్ట్రంలో 'గొట్టాల' విప్లవానికి తెరతీసినట్లయింది. రాష్ట్రంలో ఏమూలన, ఏ క్షణంలో చీమ చిటుక్కుమన్నా పెనువేగంతో పోటీ పడి న్యూస్ ను 'బ్రేక్' చేస్తూ ఈ రెండు చానల్స్ సాగిస్తున్న వీరవిహారం అనేక 'గొట్టాల' కంపెనీల పుట్టుకకు ప్రేరణగా నిలిచాయి. ఒక విప్లవకారుడు వేయి మంది విప్లకారులను పుట్టిస్తాడన్న నానుడి 'గొట్టాల విప్లవం' విషయంలో అచ్చుగుద్దినట్లుగా సరిపోయింది. ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ప్రతిపక్ష నేతలు, చోటా మోటా రాజకీయ నాయకులు, అధికారులు, వ్యాపార, వాణిజ్యవేత్తలు, నటీనటులు, సెలబ్రిటీలు... ఒకరేమిటి సమాజంలో కీర్తి కండూతితో సతమతమయ్యే ప్రతి ఒక్కరు 'గొట్టాల' మాయలో పడిపోయారు. గొట్టం ఎదురుగా కనిపించకపోతే మాటలు పెగలని పరిస్థితి ఏర్పడింది. కేవలం టివిలో చూడ్డానికి మాత్రమే అలవాటు పడిన ప్రజలకు ఈ వార్తా చానళ్ళ పుణ్యమా అంటూ తాము కూడా బుల్లితెరపై దర్శనం ఇచ్చే యోగ్యం పట్టడంతో వార్తా చానళ్ళ పట్ల ప్రజలలో సైతం విపరీతమైన మోజు పెరుగుతూ వచ్చింది. ఈ రోజు జరిగిన సంఘటన రేపు పేపర్లో వచ్చే వరకు ఎదురుచూడనవసరం లేకుండా టెలివిజన్ చానళ్ళు ఎప్పటికప్పుడు వండి, వడ్డించేయడం తెలుగు ప్రజలకు సరికొత్త అనుభవం, అనుభూతిని కలిగించింది. పేపర్ చదవడం రాని నిశానీల నుంచి తలపండిన పండితుల వరకు న్యూస్ చానల్స్ కు ప్రేక్షకులైపోయారు.

Read 1 Comment(s) posted so far on this Article!

  Page: 1 of 3   Next > >  



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.