|
|
Articles: Poetry | తెలుగు పతాకం - Editor
| |
(వెలుగు వెంకట సుబ్బారావు)
తెలుగు పతాకమా..
మా జాతి పతాకమా..
ఎగరేస్తాం మళ్ళీ పైపైకీ
మా గుండెల ఊపిరి నింపీ
ఒక్కో తరం, ఒక్కో తరం
ఎంత నలిగిపొయ్యావో..
ఏ చీకటి దుమ్ములో
ఎంత మాసిపొయ్యావో..
నీ ఎదుగుదలకు అడ్డమైన
ప్రతి కంపనూ పెళ్ళగించి
జనం బతుకు మలుపుల్లో
ఏరువాక పొంగిస్తాం
ఏ అవసర దూరాలను
నీ గొంతై కలుపునో..
ఏ అలజడి తీరాలను
నీ నడకై నిలుపునో..
అదే యాస, అదే బాస
శ్వాస శ్వాసకూ పంచీ
ఉద్యమాల కనురెప్పల
రెపరెపలై జీవిస్తాం.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|