|
|
Articles: Poetry | సంఘాల్లో సునామీ - Editor
| |
(బుచ్చిరెడ్డి)
అమెరికా తెలుగు సంఘాలు
కొద్దిమంది చేతుల్లో
ఆడుతున్న బొమ్మలాటలు
వీళ్ళు
డబ్బున్నోళ్ళు
డాక్టర్లు--- ఇంజనీర్లు
మాజీ ప్రెసిడెంట్లు
వాళ్ళకు అన్నీ తెలుసు
తెలివి గలవాళ్ళు
రాజకీయ చాణక్యులుగా
చలామణి అవుతూ
సంగాలలో నివసిస్తూ
తోటి సభ్యులను
దళితులుగా
దూరం కొడుతూ
డమ్మీ ప్రాక్సీలతో
రంగ ప్రవేశం చేస్తూ
అన్ని కమిటీలలో
స్థావరాలు కల్పించుకుంటూ
కాంగ్రెస్ నేతల్లా--- నీతులు బోధిస్తూ
తోలుబొమ్మలాడిస్తున్న
రాజకీయ వారసులు వీళ్ళు
వీళ్ళకు తెలుగు రాధు
తెలుగు మాటలాడరు
ఒబామాలు కానే కారు
శివారెడ్డి మిమిక్రీలో
ఇలియానా బొడ్డు చూస్తూ
స్వాములవారి హితబోధలతో
స్పీకర్ సురేష్ రెడ్డి సగం తెలుగు -- సగం ఇంగ్లీష్
ఉపన్యాసంలో
తెలుగు భాష--- తెలుగు సంస్కృతి-- తెలుగు కళలు
ఏరుకుంటున్న
21 పాస్ట్ సెంచురీ
అమెరికా తెలుగు సంఘాల నేతలు -- వీళ్ళు
మొన్న కాంగ్రెస్
నిన్న తెలుగుదేశం
నేడు పవన్ కల్యాణ్ తో
పూసుకు తిరుగుళ్లు--- పూజలు
తెలుగు టైమ్స్ లో బొమ్మలు
అటు కోర్ట్ కేసులు
అవిశ్వాస తీర్మానాలు
స్టే ఆర్డర్ లతో
సునామీ-- ఏ దారి తొక్కుతుందో
అంతు తెలియని-- గమ్యంతో
మాది-- సేవ అని
మురుస్తున్న ఊసరవెల్లి నేతలు
వీళ్ళ మాటలకు ఎదురులే ధు
పేచీలతో
సొంత ఎజెండాలతో
రెడ్డి వస్తే మొదలులాగా
కొత్త పాటలు-- పాడుతూ
కొత్త రూల్స్
సరికొత్త పోస్ట్ లతో
హీరో వేషాలు వేస్తూ
కోట్ల ఖర్చుతో
ఆడిట్ లేని తీరుతో
నడుస్తున్న మరోప్రపంచం
అమెరికా తెలుగు సంఘాలు
రూల్స్-- బైలాస్ ఉండవు
డబ్బున్నోళ్ళ మాటలతో
ఆదరణతో
మాజీ ప్రెసిడెంట్స్ రాజకీయాలతో
పదవులు రావొచ్చు
లేదా-- నీవు మాయం కావొచ్చు
వాళ్ళు నిన్ను ముంచగలరు
వాళ్ళు నిన్ను తేల్చగలరు
వాళ్ళ అవసరం కొద్దీ
నీకు ఫోన్ కాల్స్
గుర్తింపు
ఉపయోగించుకోవడం
అవసరం లేని రోజు
నీ బ్రతుకు
పచ్చిపులుసులోని ఈగలా
నిన్ను సరిగా కూడా
ఏరుకోనివ్వరు
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|