TeluguPeople
  are the trend-setters

 
Articles: My Thoughts
దొర లు మారాలి
- Editor
  Page: 1 of 1    
(బుచ్చి రెడ్డి) ఇది దొరల రాజ్యం ఇది దొంగల రాజ్యం స్వరాజ్యం వచ్చిందీ దొరలకు-- దోపీడీదారులకు ఖూనీకోరులకు--చెంచాలకు, దొరలకు--కావలసిందీ--పెత్తనం ఆధిపత్యం--- రాజరికం వీళ్ళు గోడ మీది పిల్లులు నక్కజిత్తుల తెలంగాణా కాంగ్రెస్ నేతలు జెండా రంగులు మార్చడంలో మిల్కాసింగ్ కన్నా మిన్నగా పరుగులు చేయగలరు పదవులు చేపట్టాగలరు. వీళ్ళకు వోట్ వేయించుకోవడం వాళ్ళే వేసుకోవడం-- తెలుసు వోట్--కొనగలరు ఈ రోజు అన్ని పార్టీలలో అస్సెంబ్లీ-- లోక్ సభ-- రాజ్యసభ టిక్కెట్లు పార్సెలు. దొరలు కొనగలరు రేపు రెట్టింపుగా సంపాదించగలరు. యా బై ఏండ్ల చరిత్రలో రాష్ర్టాన్ని ఎక్కువ కాలం రాజ్యమేలిందీ--- దొరలు దోచుకుందీ--- దొరలు ముంచిందీ--- దొరలు బోలో స్వంతత్ర భారత్ కి జై వీళ్ళ గారరడీ మాటలకు నిఘంటువులో కొత్త అర్థాలు వెతుక్కోవాలి. వీళ్ళు శివారెడ్డి మిమిక్రీలా గొంతులు మార్చగలరు కొత్త పాటలు పాడగలరు చరిత్ర పేజీలు తిప్పండి అః రోజు-- నిజాం నవాబ్ తో చేయి కలిపిందీ --- వీళ్లే ఈ రోజు వ్యక్తి పూజలతో సోనియా--బాబు---చిరులకు చెంచాగిరి చేస్తున్నది -- వీళ్ళే ఏ ఎండకు-- ఆ గొడుగు బ్రతకనేర్చిన వాళ్ళు బ్రతుకులను కూల్చేవాళ్ళు. ఇల్లు కాలుతుంటే బొగ్గులేరుకునే వాళ్ళు. సంస్కృతం మాత్రమే చదివే వేద పండితులకూ దళిత కవిత్వం బోధపడదన్నట్లు ఈ దోపిడీ ఖద్దరులకు పేగుల సరిగమలు ఆకలి చావులు దగా పడ్డ తెలంగాణా-----అర్థం కావు జీవితాలను--- ప్రాంతాన్ని ఫాయిధా లేని సత్తుబిళ్ళగా చెత్తకాగితంలా--చేసిందీ- ఈ ఖద్దరలు షా లు కారా??? ఎంతకాలం-- ఈ గింజులాటలు---గుంజాటనలు ఎంతకాలం--- ఈ జోలపాటలు-- లాలిపాటలు ఎంతకాలం---చిలుక జోస్యాలు--- చిలుక పలుకులు ఎంతకాలం---ఈ రంపపు కోతలు మారూతూ ఉన్నకాలం ఎందిరా ?? బాంచెను--కాల్లు మొక్తా చెప్పులు చేతబట్టి-- వంగిన నడుముతో తాకితే-- ముట్టు అయితామన్న ఆ రోజులు హక్కుల ఉద్యమాలతో ఆత్మగౌరవ పోరాటాలతో మంటగలిసి పోయినాయి పాత్రలు-- వేషాలు మారిపొయినవి--- ఫైల్ క్లోస్డ్ కాలంపై సమరం ప్రకటిస్తూ తిరుగుబాటు మొదలైందీ అవమానం--- అవహేళన తట్టుకొలేక ఆగ్రహం-- ఆక్రోశం-- తపన బద్ధలు అయి చిమ్మిన లావా దళిత ఉద్యమం దారి చూపే దిక్సూచి ఇక వచ్చేది దళిత శకమె? ఒక వై పూ-- గౌడ్ నాయకత్వంతో జై తెలంగాణా నినాదంతో నవ తెలంగాణా పార్టీ ఊరేగింపు--- మరో వై పూ-- చంద్రశేఖర్ కన్నా నాయకత్వంలో ప్రజా తెలంగాణా పాతతో ఊరేగింపు--- రెండు గుంపులు ఒకటై కొత్త ఉద్యమ--మొదలు ఆవబోతున్నది సిలబస్ మారుతుందీ దొరలు-- పాత మార్చండి గొంతులు కలపండి మన అందరిది ఒకే మాట ఒకే పాత ఒకే మాట జై తెలంగాణా -- కావాలి దొరలు మారాలి-- తెలంగాణా రావాలి.

Read 1 Comment(s) posted so far on this Article!

  Page: 1 of 1    



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.