|
|
Articles: Poetry | హైకూలు--1 - Mr. dayakar Bommareddy
| |
దారంతా మల్లెలు
సుగంధ పరిమళాలు
తను ఇప్పుడే ఇలా వెళ్ళింది
దారంతా ముల్లులు
తెగిపడిన గులాబీలు
తను నా నుంచి వెళ్ళిపోయింది
******************
తను నన్ను చూసి నవ్వింది
నా మనసు లయ తప్పింది
నన్ను వీడి తన సిగలో చేరింది
******************
నీ కురులు నల్లని మబ్బులైతే
అందు నీ ముఖం చందమామైతే
నాకు పగలే వెన్నెల కాదా చెలి
******************
నీ మనసులోని ప్రేమ
అమృతంగా మరి నాలోకి ఇంకింది
తొలి ముద్దు ఇంత తియ్యగా ఉంటుందా?
************************
నీకు ఏదేదో చెప్పాలని ఉంటుంది
కొండంత ధైర్యం అణువంత అవుతుంది
గుండె వేగం స్పష్టంగా తెలుస్తూంది
************************
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|