|
|
Articles: Poetry | ప్రేమంటే? - Mr. Vamsi Krishna K
| |
నా నవనాడుల వీణపై...
నువ్వు శృతించే రాగమేనా ప్రేమంటే...?
నా గుండె గదుల్లో...
నువ్వు రక్తమై ప్రవహించడమేనా ప్రేమంటే..?
నా కళ్ళ వాకిళ్ళని...
నువ్వు కలల వరదై ముంచెత్తడమేనా ప్రేమంటే...?
నువ్వు లేక విరహపు ఎండలో...
నేను కన్నీళ్ళతో దాహం తీర్చుకోవడమేనా ప్రేమంటే...?
ఇలా కోటి భావాలు అక్షరాలతో ఆడుకుని..
కవితలుగా మారిపోవడమేనా ప్రేమంటే...?
నిన్ను... ప్రేమకే ప్రేమించాలనిపిస్తుంది...
ఇక నేనెంత... ప్రియా...!
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|