|
|
Articles: Poetry | ఆంగ్ల ఉగాదులేనా? - Editor
| |
(అమ్మిన శ్రీనివాసరావు)
విశ్వ జ్ఞానానికి
విజ్ఞానపు గవాక్షం నీవట!
డాలర్లు కురిపించే కల్పవృక్షానివట!!
అందుకే అందిస్తున్నాం... నీకు
పలుకులే నేర్వని 'పసి(డి) సంపద'ను
నువ్వంటే మాకెంతో... లవ్వు మీద లవ్వు
అన్నా... విన్నా... అంతా నీవే!!
మా కుర్రాళ్లకు
నీ అలవాట్ల ఆనవాళ్ళే గుర్తు
మా ఆచారపు సంపదంతా
'సద్దిమూట'... వద్దే వద్దు!
హ్యాపీ న్యూ ఇయర్ల ముందు
ఉగాదుల ఊసులే మిస్సు
న్యూ ఇయర్ ఇంటింటా రంగోలీ కలర్స్ కళకళలు
ఉగాది పూట మూగవోతున్న కోయిల రాగాలు
అయితే వచ్చేవన్నీ ఆంగ్ల ఉగాదులా?!
అయినా ఆగదు
తెలుగు సాహితీ యోధుల అక్షరయుద్ధం!
భాషా సంస్కృతుల పరిరక్షణార్థం!!
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|