|
|
Articles: Poetry | కాలం వృథా చేయకు - Editor
| |
(చల్లగాలి బాబూరావు)
ఓ నేస్తం!
నీ జీవితం దు:ఖమనే
చీకటిలో ఈదులాడుతుంటే
ధైర్యమనే దీపపు వెలుగులో
సంతోష సుఖ కాంతుల్ని నింపుకో..
కులమతాల కల్మషపు
ఆచారాల్నితుడిచేసుకో
మగ్గిపోయిన మూర్ఖపు భ్రమల
తెరల్ని త్రుంచేసుకో..
అవినీతుల్ని చెండాడి
అన్యాయాల్ని ఎదిరించి
నీతి నిజాయితీలకు నిలయమై
జనజీవన సౌఖ్యానికి అద్దంపట్టు..
దినదినం దరిద్రపు దుప్పటిని
కప్పుకొని కుళ్ళి కుళ్ళి ఏడ్వకు
అనుక్షణం ఆ'కాంక్ష'లకై ఎగసిపడి
అందని పండ్ల కోసం ఆశపడకు..
అనుమానాల్ని మది నిండా నింపుకొని
అనుమాన పెనుభూతంలా అగుపించకు
అవసరం లేని అలవాట్లకు బందీవై
అనవసరమైన కాలయాపనతో విర్రవీగకు..
ఇటు చూడు నేస్తం-
ఎటువైపు నీ పయనం-
ఆలోచించు...
ఈ కాలాన్ని మాత్రం వృథా చేయకు.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|