|
|
Articles: Poetry | మరల తెలుపవే మనసా - divya tummala
| |
మరల తెలుపవే మనసా సఖునికి నా జాడ
ఏదో పులకింతగా ఉందని ఈ వేళ
చుట్టూర గుంపున్న తన వైపె చూస్తున్న
గేయం రచియిస్తున్న తన ఊసే వింటున్న
నయనాల్లో తన రూపే ముద్రించుకు పోతున్న
మధురముగా ఉన్నదీ ఈ వింత యాతన
పదముల ప్రశ్నిస్తున్న పయనం ఎటు వైపని
మువ్వల సవ్వడి చెప్పెను వలచిన తన వైపని
బ్రతుకంతా తన తోనే నడవాలనుకుంటున్నా
సప్త పదులు మెట్టుటకై నేను ఎదురు చూస్తున్న
అంతస్థుల అడ్డుగోడ ఆటంకమై
నిశ్శబ్దం నీ వెనుకె తరుముతు వస్తున్నా
మమతల మధువులు గ్రోలిన ఈ హృదయం సాక్షిగా
ప్రియమార పలికిన ఈ పెదవులు సాక్షిగా
మరల మరల తెలుపవే
మరిచిపోక తెలుపవే సఖునికి నా జాడ
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|